Jayshankar Bhupalpally:(IMAGE credit: swetcha reporter)
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Jayshankar Bhupalpally: భూపాలపల్లిలో దొంగల హల్ చల్ 10 ఇళ్లలో చోరీ

Jayshankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దొంగలు హల్ చల్ సృష్టించారు. లక్ష్మీనగర్ కాలనీలో  రాత్రి ఏకంగా 10 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగలు సుమారు 30 తులాల బంగారు నగలు, భారీ మొత్తంలో నగదును అపహరించుకుపోయారు. రాఖీ పండుగ కావడంతో పలు కుటుంబాలు తమ ఇళ్లకు తాళాలు వేసి బయటకి వెళ్లాయి.

Also Read: CMRF Fund Scam: సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసిన బాగోతం

ప్రజలు తీవ్ర భయాందోళ

దీన్ని ఆసరాగా చేసుకుని దొంగలు ఈ చోరీలకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన బాధితులు దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసుల(Police)కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) కూడా లక్ష్మీనగర్ కాలనీని సందర్శించి బాధితులతో మాట్లాడారు. దొంగలను వీలైనంత త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. గతంలో కూడా భూపాలపల్లిలో పలు దొంగతనాలు జరిగాయి. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

 Also Read: Hyderabad Rains: ప్రజలకు ఎలాంటి కష్టం రానివ్వద్దు.. రౌండ్ ద క్లాక్ అలెర్ట్‌గా ఉండాలి

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ