CMRF Fund Scam(Image CREDIT: TWITTER)
నార్త్ తెలంగాణ

CMRF Fund Scam: సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసిన బాగోతం

CMRF Fund Scam: కష్టాల్లో ఉన్నవారికి బాసటగా ఉండేందుకు సీఎంఆర్ఎఫ్(CMRF )నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంటుంది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్(CMRF )నిధులు పక్కదారి పట్టాయి. ఈ విషయం తాజాగా వెలుగుచూసింది. ఓ వ్యక్తి తనకు రావాల్సిన డబ్బుల గురించి ఆరా తీయగా తన పేరుతో ఉన్న మరో వ్యక్తి అకౌంట్‌లో డబ్బులు జమ కావడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా భారీ స్కామ్ వెలుగుచూసింది.

 Also Read: GHMC Commissioner: సహాయక చర్యల్లో వేగం పెంచండి: కమిషనర్ కర్ణన్

అసలేం జరిగిందంటే?

నడిగూడెంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావు (Gaddam Venkateswara Rao) అనే వ్యక్తి 2022లో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో సీఎంఆర్ఎఫ్ (CMRF) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ట్విస్ట్ ఏంటంటే 2023లోనే ఇతనికి లక్షన్నర మంజూరైంది. కానీ, చెక్కు మాత్రం అందలేదు. అతని అకౌంట్ వివరాలు మార్చి గడ్డం వెంకటేశ్వరరావు (Gaddam Venkateswara Rao) అనే వ్యక్తి ఖాతాలోకి నగు బదిలీ చేసింది ముఠా. ఏళ్లు గడుస్తున్నా తనకు డబ్బులు అందకపోవడంతో బాధితుడు సంబంధిత అధికారులను వాకబు చేయగా అసలు నిజాలు వెలుగుచూశాయి.

కీలక నేత పాత్ర ఉందా?

సీఎంఆర్ఎఫ్(CMRF) కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే, సంబంధిత చెక్కులు స్థానిక ప్రజాప్రతినిధి దగ్గరకు వచ్చేవని సమాచారం. అనుచరులు పంపిణీ చేసేందుకు తీసుకుని దరఖాస్తు చేసుకున్న వారికి కాకుండా, పేరు, ఇంటి పేరుకు దగ్గరగా ఉన్న వారి అకౌంట్లకు నగదు బదిలీ చేసినట్టు తెలుస్తున్నది. అయితే, సదరు లీడర్‌గా తెలియకుండా ఇదంతా జరగదనే ప్రచారం జరుగుతున్నది. గతంలో సెక్రటేరియట్‌లో పని చేసిన కీలక ఉద్యోగి దీనికి సహకారం అందించినట్టు సమాచారం. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నట్టు తెలిసింది.

 Also Read: Solar Power Plant: జీపీ నుంచి సెక్రటేరియట్.. భూముల వివరాలు పంపండి

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు