రౌండ్ ద క్లాక్ అలెర్ట్ గా ఉండాలి
అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి
వాటర్ లాగిన్ పై స్పెషల్ గా ఫోకస్ చేయాలి
ప్రజలకు ఎలాంటి కష్టం రానివ్వద్దు
హెచ్ ఓ డి లు ఫీల్డ్ లెవల్ విధులు నిర్వహించాలి
అవసరమైతే అన్ని విభాగాల అధికారుల, సిబ్బంది సెలవు రద్దు చేయాలి
వర్షాలపై ఉన్నత స్థాయి సమీక్షలో హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
Hyderabad Rains: గ్రేటర్ హైదరాబాద్ నగరానికి మరికొద్ది రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉండడంతో అధికారులంతా రౌండ్ ది క్లాక్ అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి నగరంలో వరద బారిన పడిన ప్రాంతాలను, నీట మునిగిన ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం పరిశీలించినట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా వాతావరణ శాఖ జారీ చేస్తున్న హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని నగరంలో జనజీవనంతో ముడిపడి ఉన్న జిహెచ్ఎంసి, పోలీస్, ట్రాఫిక్, జలమండలి, ఆర్టీసీ వంటి విభాగాల అధికారులు అంతా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో వర్షాలు, తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ కర్ణన్, జి హెచ్ఎం సి ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం పూర్తి అయ్యే వరకూ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి, హైడ్రా, జలమండలి, ట్రాఫిక్, విద్యుత్, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన మాన్సూన్ సంబంధిత పనులు, రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్ వర్క్స్, డీ – సీలింగ్, రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా చేపట్టిన రోడ్డు మరమ్మత్తు, క్యాచ్ పిట్ పనులు, హైడ్రా సమన్వయంతో చేపడుతున్న పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ మంత్రికి వివరించారు. సివరేజ్, స్టార్మ్ వాటర్ కలిసే ప్రదేశాలను గుర్తించి వాటిని వేరు చేసే ఓవర్ ఫ్లో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ సహా ఓఆర్ఆర్ లోపల ప్రజలకు ఇబ్బందులు దూరం చేసేందుకు జిహెచ్ఎంసి, హైడ్రా, జలమండలి, ట్రాఫిక్, విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూ, లేక్స్ విభాగం అధికారులు, సిబ్బంది మరింత సమన్వయం, మరింత ప్రభావంతంగా పనిచేయాలన్నారు.
Also Read- Jr NTR: సీఎం రేవంత్‌కు థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయిన ఎన్టీఆర్.. ఏం చేశాడంటే?
వర్షకాలంలో వేగంగా సమస్యల పరిష్కారానికి లైజనింగ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఆ ప్రధాన బాధ్యత జిహెచ్ఎంసి తీసుకోవాలన్నారు. వర్షకాలంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సెలవులు రద్దు చేయాలన్నారు. సంక్షోభ, సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సమర్థత చూపుతూ వాటిని పరిష్కరించేందుకు ఉమ్మడిగా, కలసికట్టుగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. వర్షాకాలం పూర్తి అయ్యే వరకూ తాను కూడా రౌండ్ ద క్లాక్ ప్రజలకు అధికారులకు అందుబాటులో ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. పభుత్వ పరంగా ఏమైనా జోక్యం అవసరం ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందిస్తానని మంత్రి క్లారిటీ ఇచ్చారు. వ్యర్థాలను లేక్‌లు, చెరువులు, నాలాలలో వేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించారు.
Also Read- Vijay Devarakonda: బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌తో విజయ్ సినిమా.. కాంబో అదిరింది!
వర్షపు నీటి సంరక్షణ సామాజిక బాధ్యత -మంత్రి పొన్నం
వర్షపునీటి సంరక్షణ సామాజిక బాధ్యత అని హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలో వాటర్ మేనేజ్మెంట్‌కు జిహెచ్ఎంసి, హైడ్రా, జలమండలి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలా చూడాల్సిన బాధ్యత అధికారుల పైనే కాకుండా, ప్రజల పైన కూడా ఉందన్నారు. నగర ప్రజలను ఆ దిశగా చైతన్యం చేయాలన్నారు. వినని వారిని సామదాన దండోపాయాలను ఉపయోగించి ఇంకుడు గుంతలు, ఇతర మార్గాలను ఉపయోగించి వర్షపునీటి సంరక్షణ చేసేలా చూడాలన్నారు. అనంతరం మంత్రి అన్ని విభాగాల అధికారులతో కలిసి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల నగర ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతోనే నగరంలో ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లలేదన్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప సమయంలో అధిక వర్షాల వల్ల వరద ఓవర్ ఫ్లో అవుతుందని, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దశాబ్దాలుగా ఉన్న ట్రాఫిక్ జామ్ సమస్యలతో పాటు వరద ముంపుకు శాశ్వత పరిష్కారం కోసం మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తుందని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో హైడ్రా కమిషనర్ ఎ వి రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్,జోనల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు