Viral Video: వైవాహిక జీవితం అనగానే సాధారణంగా భార్య, భర్తలు, పిల్లలు గుర్తుకువస్తారు. వీటికి తోడు భర్త మోసే కుటుంబ భారం, ఆర్థిక కష్టాలు, స్కూలు ఫీజులు, పిల్లల అనారోగ్య సమస్యలు కామన్ గా కనిపిస్తుంటాయి. నిత్యం ఈ కష్టాల్లో మునిగి తేలుతూ ఉండే భర్త.. వీకెండ్ వచ్చేసరికి కాస్త రిలాక్స్ అవుదామని భావిస్తుంటాడు. కొద్దిసేపు భార్య, పిల్లల టెన్షన్స్ నుంచి సేద తీరడానికి ప్రయత్నిస్తుంటాడు. అక్కడికి కూడా ఫ్యామిలీ వచ్చేస్తే ఆ మగాడి పరిస్థితేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిగ్గా ఈ అనుభవానికి అద్దం పట్టే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ సింహం, దాని ఫ్యామిలీకి సంబంధించిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? అందులోని సింహానికి మగాడి లైఫ్ కు ఉన్న లింకేంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.
వీడియోలో ఏముందంటే?
ప్రముఖ వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ (wildlife photographer) జాక్వెస్ బ్రియామ్ (Jacques Briam).. సోషల్ మీడియాలో ఓ వీడియో క్లిప్ ను పంచుకున్నారు. అందులో ఓ సింహం.. పిల్లలను చూసుకునే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. వీడియోను గమనిస్తే.. మెుదట ఓ మగ సింహం.. అడవిలో ప్రశాంతంగా కూర్చొని ఉంది. తన చుట్టుపక్కల గమనిస్తూ విశ్రాంతి తీసుకుంటోంది. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతంలోకి ఓ ఆడ సింహం తన చలాకి పిల్లలతో కలిసి వచ్చింది. వాటిని చూసిన మగ సింహం వెంటనే లేచి అక్కడినుంచి తుర్రున జారుకుంది. ఆడ సింహం మాత్రం దానిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పిల్లలతో ధైర్యంగా ముందుకు సాగింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మగ సింహం కూడా అచ్చం పురుషుల వలే ప్రవర్తించిందని పేర్కొంటున్నారు.
View this post on Instagram
Also Read: UP Crime: సీక్రెట్‌గా ఇంటికి పిలిచిన లవర్.. కట్ చేస్తే శవంగా తేలిన ప్రియుడు!
నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
సింహం వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇప్పుుడు నీ వంతు. పిల్లల్ని చూసుకోవాలి అని భార్య మాట వినగానే.. ఏదో పని గుర్తొచ్చినట్లు సింహం పరిగెత్తింది’ అని పోస్టులు పెడుతున్నారు. ‘జాతి ఏదైనా అందరు మగవారు ఒక్కలాగే ఉంటారు’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ‘ఆ సింహానికి చాలా దూరంలో ఉన్న మందను చెక్ చేయాలని గుర్తుకు వచ్చింది’ అంటూ ఇంకొకరు పోస్ట్ పెట్టారు. ‘ఈ సంవత్సరం నేను చూసిన అత్యంత రిలేటబుల్ వైల్డ్‌లైఫ్ వీడియో ఇదే’ అని మరొకరు సమాధానం ఇచ్చారు. ఇంకొకరు ‘ఆ ఆడ సింహానికి అతడు ఏం చేస్తున్నాడో బాగా తెలుసు.. అందుకే పట్టించుకోలేదు’ అని రాశారు. ‘నేను చూడనట్టు నటిస్తే.. ఇక అది నా సమస్య కాదనే క్లాసిక్ ఫార్ములా సింహం వాడుతోంది’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మెుత్తంగా లయన్ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోందని చెప్పవచ్చు.