Crime-News
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Crime News: ప్రియుడిని ఇంటికి పిలిపించి.. భర్తతో కలిసి…

Crime News: వివాహేతర సంబంధాలు ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నారు. కుటుంబాల్లో విభేదాలను సృష్టిస్తున్నాయి. వ్యక్తిగతంగా చేసే ఒక్క తప్పుకు మొత్తం కుటుంబం ప్రభావితం అవుతోంది. తీవ్రమైన నేరాలకు కూడా దారితీస్తోంది. అలాంటి ఘటనే ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్‌‌లోని సంభల్‌ జిల్లాలో (Crime News) వెలుగుచూసింది. దాదాపు 45 ఏళ్ల వయసున్న అనీష్‌ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశారనే అనుమానంపై ఓ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనీష్‌ను ఇంటికి పిలిచి, స్క్రూడ్రైవర్‌, ప్లయర్స్ (కటింగ్ ప్లేయర్లు) ‌లాంటి పరికరాలతో శారీరకంగా అత్యంత అమానుషంగా చిత్రహింసలకు గురిచేసి చంపేసిన ఘటనలో ఈ దంపతుల ప్రమేయం ఉందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

నిందిత దంపతులు.. మృతుడు అనీష్ వద్ద ఏడేళ్లక్రితం రూ.7 లక్షలు అప్పుగా తీసుకున్నారని, డబ్బు అడిగేందుకు ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘోరానికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, ఈ దారుణం వెనుక అనీష్‌కు వివాహేతర సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read Also- Rajnath Singh: డొనాల్డ్ ట్రంప్‌కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన రక్షణమంత్రి రాజ్‌నాథ్

అనీష్ తండ్రి ముస్తకీం మాట్లాడుతూ, తన కొడుకుని చాలా దారుణంగా హత్య చేశారని, కాళ్లుచేతులు విరగ్గొట్టారని వాపోయారు. దుస్తులు విప్పి అతి క్రూరంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు కారణం ఏమై ఉండొచ్చని మీడియా ప్రశ్నించగా.. అనీష్‌కు పెళ్లి నిశ్చయం అయ్యిందని, దీంతో, ఏడేళ్లకిందట ఓ పొరుగు వ్యక్తికి ఇచ్చిన రూ. 7 లక్షల అప్పు విషయమై అడిగేందుకు ఇంటికి వెళ్లాడని అన్నారు. తన కొడుకుని ఎంత దారుణంగా హత్య చేశారో తాను చెప్పలేనని తండ్రి ముస్తకీం కన్నీరుమున్నీరయ్యారు.

తప్పించుకొని ఇంటికి..

నిందిత వ్యక్తుల చేతుల్లో చిత్రహింసలకు గురైన అనీష్ అక్కడి నుంచి తప్పించుకొని, తాము గుర్తుపట్టలేని స్థితిలో, అత్యంత తీవ్రమైన గాయాలతో ఇంటికి వచ్చాడని ఇతర కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుల ఇంటి నుంచి దూరంగా పరిగెత్తి, ఎదోవిధంగా ఇంటికి చేరుకున్నాడని, కానీ, గాయాలు తీవ్రమైనవి కావడంతో కొద్దిసేపటికే చనిపోయాడని వాపోయారు.

Read Also- Crematorium reel: వైరల్ అవ్వడం కోసం దిగజారిన యువతి..

ఈ షాకింగ్ ఘటనపై జిల్లా అదనపు పోలీసు అధికారి (ASP) రాజేష్ కుమార్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు. అనీష్ మృతిపై రాత్రి సమయంలో తమకు సమాచారం అందిందని, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టామని వెల్లడించారు. బాధితుడిని హత్య చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు అహ్మద్, అతడి భార్య సితారపై అనుమానాలు వచ్చాయని అన్నారు. మృతుడు అనీష్‌కు సితారతో శారీరక సంబంధం ఉన్నట్టు తెలుసుకున్న భర్త అహ్మద్ హత్య కుట్రపన్నాడని, దంపతులు ఇద్దరూ కలిసి అనీష్‌ను చంపాలని పన్నాగం వేశారని తెలిపారు. అనీష్‌ను ఇంటికి పిలిపించి హింసించి హత్య చేశారని తెలిపారు. అయితే, సితార ఎందుకు భర్తతో కలిసి ఈ హత్యకు పాల్పడింది?, కారణం ఏంటి? అనేది పోలీసులు ఇంకా రాబట్టలేదు. పూర్తి దర్యాప్తు తర్వాత అన్ని వివరాలు తెలియనున్నాయి.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ