Tribal Committee9(Imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Tribal Committee: చట్టాలు అమలు చేయకపోతే స్వయం పాలన ప్రకటిస్తాం

Tribal Committee: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల చట్టాలు అమలు చేయకపోతే స్వయంపాలన ప్రకటించుకుంటామని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు హెచ్చరించారు. వెంకటాపురం మండల కేంద్రంలో బోడె బోయిన జయరాం అధ్యక్షతన ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని(World Indigenous Peoples Day) ఘనంగా నిర్వహించారు. కొమరం భీమ్ దాదాకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఊయిక శంకర్, కొర్స నరసింహమూర్తి, వాసం నాగరాజు, పూనెం రామచందర్, ప్రతాప్, సాయి, సిద్దబోయిన సర్వేశ్వరరావు, చింత సమ్మయ్య, సర్వేశ్ మాట్లాడారు.

సహజ సంపదపై సర్వహక్కులు

ఆదివాసీల పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధమనకాండ కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. ఆపరేషన్ కగార్(Operation Kagar) పెట్టి ఆదివాసీల పైన మారణకాండ కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు తరతరాలుగా కాపాడిన సహజ సంపదను కేంద్ర ప్రభుత్వం హరించుకుపోయేందుకు పన్నాగాలు పన్నుతుందన్నారు. సహజ సంపదపై సర్వహక్కులు ఆదివాసీలకే ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెసా గ్రామ సభలను నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికే 20230 గనుల్లో సహజ వనరులను తోడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 శాతం బొగ్గు ఐదు షెడ్యూల్ ప్రాంతం నుండి వెళ్తోందని గుర్తు చేశారు. ఆపరేషన్ కగార్ కాదని ఆపరేషన్ ఆదివాసీలే టార్గెట్ అని వెల్లడించారు. ఐదో షెడ్యూల్ ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని ఆర్థికంగా ఆదుకునేది ఆదివాసి సంపదనేనని స్పష్టం చేశారు.

Also Read: Secunderabad Station: బిగ్ అలెర్ట్.. సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు మళ్లింపు.. తెలుసుకోకుంటే కష్టమే!

ఆదివాసీలను ఓటు వేసే యంత్రాలా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూలవాసుల పైన ముప్పేట దాడులు చేస్తున్నాయని, న్యాయస్థానాలు, మేధావులు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. అధిమ తెగల్లో నిరక్షరాస్యత, నిరుద్యోగం శరవేగంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 3 తక్షణమే పునరుద్ధరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివాసి చట్టాలు(Aboriginal laws) అమలుకు నోచుకోవడం లేదని, పాలకులు ఆదివాసీలను ఓటు వేసే యంత్రాలుగానే చూస్తున్నారని చెప్పారు. విద్య, వైద్యం కోసం దిక్కులు పిక్కటిల్లెల నినాదాలను హోరెత్తించారు.

ఖనిజాల కోసమే ఆదివాసీల పైన దాడులను విస్తృతం చేశారని దుయ్యబట్టారు. ఆదివాసీల పైన ప్రభుత్వాల రాజ్య హింస పెరుగుతోందన్నారు. ఫ్యూడలిజం(Feudalism), ఫాసిజం(Fascism) ఆదివాసీల పైన పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సహజ వనరులను కొల్లగొడితే ఊరుకునేది లేదని ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ బాధ్యులు నినాదాలు చేశారు. ఆదివాసి గూడాల నుండి వేలాదిగా తరలివచ్చిన జనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల పట్ల వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: Himayat sagar: నిండుకుండలా జంట జలాశయాలు.. పోటెత్తిన వరద

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్