Jogulamba Gadwal: వర్షంతో పంటలు జీవం పోసుకున్నాయి. జూన్ ,జూలై నెలల్లో వేసవిని తలపిస్తూ ఎండలు ఉండగా మలమల మాడిపోయిన పైర్లును కాపాడుకునేందుకు రైతులు(Farmers) నానా అగచాట్లు పడ్డారు.వేసిన పంటలను కాపాడుకునేందుకు నీటి వనరులు అవకాశమున్న రైతులు(Farmers)భగీరథయత్నాలు చేసి నీటి తడులు అందించారు. ముందస్తుగా మే నెలలో కురిసిన వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లాలో(Jogulamba Gadwal District) పత్తి, కంది,ఉల్లి, కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. పంట వేసి రెండు నెలలు పూర్తయినా వర్షాలు రాకపోవడంతో పైరు గిడసబారిపోయి వాడు ముఖం పట్టడంతో రైతులు(Farmers) ఆందోళనకు గురయ్యారు.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా
ఎట్టకేలకు కురిసిన భారీ వర్షం
రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వరుణ దేవుడు కరుణించాడు. రాత్రి కురిసిన వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో మానవపాడు,ఐజ, వడ్డేపల్లి మండలాలలోని వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఈ ఖరీఫ్ సీజన్ లో ఇదే భారీ వర్షం. అప్పుడప్పుడు వర్షం వచ్చేలా మేఘావృతమైనా అక్కడక్కడ కొన్ని చినుకులు మాత్రమే తప్ప అదును వాన కురిసిన సందర్భం లేదు. సేద్యాలు, విత్తనాలు,కలుపులు, సస్యరక్షణ చర్యలకు పెట్టుబడులు పెట్టి పంట పండేందుకు రైతులు(Farmers) శతవిధాల ప్రయత్నిస్తున్నా వరుణదేవుడు సకాలంలో కురువకపోవడంతో రైతులు(Farmers)తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇప్పటికే పంట కాలం 50 రోజులు పూర్తిగా మొక్క ఆశించిన స్థాయిలో ఎదగక పూత పిందె కాయ పట్టి నిలిచిపోయింది. వివిధ రకాల పంటలు వేసిన రైతులు వర్షం కోసం కృష్ణానది జలాల నీటితో శివాలయాలలో పూజలు పూజలు చేసి వర్షాలు కురవాలని మొక్కుకున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షంతో సాగు చేసిన పంటలపై రైతుల(Farmers) ఆశలు చిగురించాయి.
ఊపందుకున్న మిరప సాగు
ఆగస్టు నెలలో సాగు చేసే మిరప పంటకు సరైన టైంలో వర్షం పడడంతో రైతులు(Farmers) ఇప్పటికే నారు మడులలో పెరిగిన మిరప నారను పొలాలలో నాటుతున్నారు. మిరపకు ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో గత సంవత్సరంతో పోలిస్తే మిరప సాగు విస్తీర్ణం జిల్లాలో తగ్గనుంది.
మెట్ట పంటలకు ఊరట
జిల్లాలో మెట్ట పంటల కింద అధిక విస్తీర్ణంలో సాగు చేసిన ప్రతి పంటతో పాటు ఇతర పంటలకు కాస్త వర్షంతో జీవం పోసినట్లైంది. మరో 10 రోజులపాటు పంటలకు డోకా ఉండదు. పంటలకు ఎరువులు పెట్టడంతో పాటు క్రిమిసంహారకమందులు పిచికారి చేసే పనుల్లో రైతులు(Farmers) నిమగ్నం కానున్నారు. రానున్న రోజులలో మరో రెండు భారీ వర్షాలు కురిస్తే ఖరీఫ్ పంటలు గట్టెక్కినట్లే.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ