Sand Scam: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక దందా
Samd Scam (imageecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Sand Scam: ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు

Sand Scam: నన్ను మించిన నాయకుడు అధికార పార్టీలో లేనే లేడనే ఓ చోటా మోట యూత్ నేత వర్ధన్నపేటలో చక్రం తిప్పుతున్నాడు. నియోజక వర్గ పెద్ద సారు ఆయన వారసుని పేరు చెప్పి వసూళ్ల పర్వం సాగిస్తున్నాడనే చర్చ సాగుతుంది. ఆ నాయకుడి కనుసైగల్లో అసైన్డ్ భూములు(Assigned lands), అక్రమార్కుల ఇసుక దందా విచ్చల విడిగా సాగిస్తున్నారు. గతంలో సీరియస్‌గా తీసుకుని అక్రమ ఇసుక రవాణా(Illegal sand transportation) అరికట్టేందుకు పలువురు అక్రమ ఇసుక రవాణా దారులను అదుపులోకి తీసుకొని బైండోవర్ చేసిన రెవెన్యూ , పోలీస్ అధికారులు. ఇప్పుడు పోలీస్, ఇప్పుడు మామూళ్ల మత్తు రాజకీయ ఒత్తిడితో చేతులు కట్టుకుని అక్రమ ఇసుక రవాణా విచ్చల విడిగా సాగుతున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాల్టా చట్టాని(Walta Act)కి తూట్లు కొట్టి ఆలేరు వాగు లూటీ చేయడంతో భూగర్భ జలాలు అడుగంట్టి పంటలకు నీరు అందకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ ఇసుక రవాణా

వర్ధన్నపేట(Vardhanpet) నియోజకవర్గంలో గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ విధానంతో స్థానిక గ్రామాలలోని ప్రజలు ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగపడిన విషయం తెలిసింది. అయితే గత కొన్ని నెలలుగా ఇసుక వ్యాపారం మూడు కాయలు ఆరు పువ్వులుగా ఇందిరమ్మ ఇండ్లు(Indiramma’s houses) కట్టుకునే లబ్దిదారులే టార్గెట్‌గా ట్రాక్టర్ లోడ్ ని రూ.5500 నుండి రూ.6500 వరకు అమ్ముకొని సొమ్ము చేసుకోవడంతో లబ్దిదారుల మీద అధిక భారం పడుతుంది. అన్ని తెలిసిన మైనింగ్(Mining), రెవెన్యూ(Revenue), పోలీస్(Police) అధికారులు ముడుపులు రాగానే మాకేం సంబంధం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

Also Read: Viral Video: ఎవడ్రా వీడు.. ఆయిల్ ప్యాకెట్ కట్ చేయకుండా, నూనెలో కరిగించి బజ్జీలు.. వీడియో వైరల్

అసైన్డ్ భూములలో ఇసుక తవ్వకాలు

వర్ధన్నపేట రామాలయం వద్ద 5 ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు(Police) సెటిల్ మెంట్ చేసుకొని వదిలేయడం పట్టణంలో చర్చినీయాంశంగా మారింది. వర్ధన్నపేట ఆకెరు పరివాహక ప్రాంతాల్లోని నందనం, ఇల్లంద, వర్ధన్నపేట, కొత్తపల్లి, ల్యాబర్తి పర్వతగిరి లోని రోళ్లకల్, కల్లెడ ప్రాంతాల్లోని పేదలకు ఆనాటి ప్రభుత్వం అందజేసిన అసైన్డ్ భూములలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు.

అసైన్డ్ భూములలో ఇసుక తవ్వకాలు చేయొద్దని చేస్తే బైండోవర్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ(Revenue), పోలీస్9Police) అధికారుల మాటలు పేపర్ల ప్రకటనలే పరిమితం, అధికారులు బైండోవర్ చేసిన అక్రమార్కులకు అవేం పట్టవన్నట్లు దర్జాగా ఇసుక దందా ఇవన్నీ తెలిసిన పోలీస్ అధికారులు వారికి ఇవేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికి ఇటు అధికార పార్టీ నాయకులు, అటు అధికారులు అక్రమార్కులకు అండగా ఉండడంతో ప్రజలకు ఎం చెయ్యాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సహాయం అందించాల్సిన వారే ఇస్టానురీతిగా రేట్లు పెంచడంతో ఆర్థిక భారం పడుతున్న అవసరం తీర్చాలంటే అప్పు తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఏర్పడింది…

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మట్టి దందా

గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు బేస్మెంట్ లెవల్‌కి మట్టి అవసరం ఉందనే విషయం ఆసరాగా చేసుకుని ఇదే అదనుగా వారి అవసరాన్ని సొమ్ముచేసుకోవలనే ఉద్దేశంతో జేసీబీ(JCB), ట్రాక్టర్ల యజమానులు గ్రామాల కార్యదర్శులతో లేటర్లు రాపించుకొని రెవెన్యూ అధికారులకు నివేదించడంతో పర్మిషన్ ఇస్తున్న తహశీల్దార్‌(MRO)‌‌‌ల పర్మిషన్ వచ్చేందే తడవుగా ఆ చెరువులోని లేదా కుంటలోని మట్టి 30 శాతం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు 70 శాతం రియల్టర్ల(Realtors)కు పోస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాకేం పట్టనట్లు మిన్నుకుండడం అక్రమార్కులకు మరింత ఊతం ఇవ్వడమే అన్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా అరికడతామని ప్రజల బాలు పలికిన అధికారులు మామూళ్ల మత్తులో తుగుతూ వాగు లూటీ అవుతున్న పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

Also Read: Tribal Girls Ashram School: గిరిజన విద్యార్థినులపై ఎమ్మెల్యే అపార శ్రద్ధ.. అన్నీ తానై!

అక్రమార్కులను అరికట్టి న్యాయం చేయాలి

అధికారులు స్పందించి నియోజక వర్గంలో అధికార పార్టీ నేతలు, అధికారుల అండతో జరిగికే అక్రమాలు అరికట్టి అర్హులకు తక్కువ రేటుకు ఇసుక, మట్టి అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Just In

01

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం

Revanth Reddy – Messi: మెస్సీతో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్