Leopard Spotted(image CREDIT: TWITTER OR FREE PIC OR SWTCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Leopard Spotted: గద్వాల జిల్లాలో చిరుత సంచారం కలకలం

Leopard Spotted:  గద్వాల జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో గుర్తు తెలియని జంతువు దాడిలో ఆవు దూడ, కోడె‌దూడ మృతి చెందడంతో గ్రామస్తులలో ఆందోళన మొదలైంది. గుర్తు తెలియని జంతువు జాడలు చిరుతవే అని ఫారెస్ట్ అధికారులు,(Forest officials) గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలోకి వెళ్లితే ధరూర్ మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన వెంకటప్ప అనే రైతు సాయంత్రం తన బావి దగ్గర గేదెలు, ఆవు, ఎద్దులతో పాటు ఆవు, కోడె దూడలను కట్టేసి ఇంటికి వచ్చాడు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

ఉదయం బావి దగ్గరకి వెళ్లి చూసేసరికి ఆవు దూడను గుర్తు తెలియని జంతువు చంపితింది. ఆవు దూడ మృతితో సుమారుగా రూ.30 వేల ఆస్తి నష్టం జరిగినట్లుగా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగ  సైతం ఉదయం పొలం దగ్గరకి వెళ్లి చూడగా అక్కడే కట్టేసిన కోడె దూడను గుర్తు తెలియని జంతువు చంపితింది. హైనా? లేక చిరుత పులి(Leopard) అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానిక రైతులు(Farmers) భయాందోళనకు గురవుతున్నారు.

రక్షణ కల్పించాలి

ఫారెస్ట్ అధికారులు(Forest officials) ఎలాగైనా దూడలపై దాడి చేసిన జంతువును బంధించి పశువులకు రక్షణ కల్పించాలని రైతులు,(Farmers)గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు(Forest Department officials)  ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. చిరుత పులి జాడలు స్పష్టంగా కనపడుతుండటంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. పులి కదలికలపై స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అది ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడుతున్నారు.

 Also Read: TS News: ఖమ్మం కలెక్టరేట్‌లో డ్రైవర్.. ఎవరూ ఊహించని పనులు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!