Viral Video: తండ్రి కూతురి మధ్య ఉండే బంధం ఎంత అద్భుతమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూతురి సంతోషం తండ్రులు ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తుంటారు. తమ చిట్టి తల్లులకు ఎలాంటి ఆపద రాకుండా జీవితంలో అడ్డుగా నిలబడిపోతుంటారు. అటు కూతుర్లు సైతం తల్లితో పోలిస్తే కాస్త తండ్రినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తండ్రి తమ పక్కన ఉంటే ప్రపంచాన్ని సైతం ఈజీగా జయిస్తామన్న భావనలో ఉంటారు. అయితే తండ్రి కూతుర్ల మధ్య ఉన్న ప్రేమకు అద్దం పట్టే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తండ్రులు ఈ వీడియో చూసి ఉప్పొంగిపోతున్నారు. అటు నెటిజన్లు సైతం దీనిని తెగ వైరల్ చేస్తున్నారు.
వీడియోలో ఏముందంటే?
సాధారణంగా కూతుర్ల దృష్టిలో తండ్రి ఎప్పటికీ హీరోనే. ఈ కూతురుని అడిగినా ఇదే ఆన్సర్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఓ క్లాస్ రూమ్ లోని చిన్నారులను ఈ అంశంపై ప్రశ్నించారు. వీడియోను గమనిస్తే.. తరగతి గదిలో ఓవైపు అబ్బాయిలు, మరోవైపు బాలికలు ఉన్నారు. అప్పుడు టీచర్ బాలికలను ఉద్దేశించి ఓ ప్రశ్న వేసింది. ‘మీ తండ్రి రాత్రి ఒక ఇల్లు పైకప్పు నుంచి మరో ఇల్లు పైకప్పుకు ఎగిరి దూకగల సూపర్‌మ్యాన్ అని అనుకునే వారు ఎంతమంది? అని బాలికలను ప్రశ్నించింది. అయితే క్లాస్ రూమ్ లోని అందరూ బాలికలు ఒకేసారి చేతులు ఎత్తి తమ తండ్రి సూపర్ మ్యాన్ అని చాటిచెప్పారు. అనంతరం చిన్నారుల చిరు నవ్వులు హర్షధ్వానాలతో క్లాస్ రూమ్ మార్మోగింది.
View this post on Instagram
Also Read: UP Sisters: ఇదేందయ్యా ఇది.. పెళ్లి చేసుకున్న అక్కాచెల్లెళ్లు.. ఇలాగైతే సింగిల్స్ పరిస్థితేంటి!
నెటిజన్ల స్పందన ఇదే..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర సమాధానాలు ఇస్తున్నారు. ‘అందుకే నాకు ఓ కూతురు కావాలని కలలు కంటాను’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరు స్పందిస్తూ.. ‘తండ్రులు కేవలం హీరోలే కాదు.. ప్రతీ అమ్మాయి జీవితంలో తొలి బెస్ట్ ఫ్రెండ్ కూడా’ అని పేర్కొన్నాడు. తాను ఈ విషయంలో ఎంతో అదృష్టవంతుడినని చెప్పుకొచ్చాడు. ఇంకొక నెటిజన్ ఫన్నీగా ‘నేను చిన్నప్పుడు నా తండ్రి రైలు ఇంజిన్ ను లాగగలరని నమ్మేవాడిని. అప్పట్లో సాధ్యమే అనిపించేది. కానీ ఇప్పటికీ నా తండ్రి హీరోగానే ఉన్నారు’ అంటూ రాసుకొచ్చారు. మెుత్తంగా ఈ ఒక్క వీడియో సోషల్ మీడియాలో చాలా మంది తండ్రి కూతుర్లను కదిలిస్తోంది. ఫాదర్ డాటర్ బాండింగ్ గురించి మరోమారు చర్చించుకునేలా చేసింది.