UP Sisters (Image Source: AI)
Viral, లేటెస్ట్ న్యూస్

UP Sisters: ఇదేందయ్యా ఇది.. పెళ్లి చేసుకున్న అక్కాచెల్లెళ్లు.. ఇలాగైతే సింగిల్స్ పరిస్థితేంటి!

UP Sisters: దేశంలో విచిత్రకమైన ఘటన చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ కు చెందిన ఇద్దరు కజిన్లు (వరుసకు అక్కాచెల్లెళ్లు) పెళ్లి చేసుకొని అందరినీ షాక్ కు గురిచేశారు. కొద్ది రోజుల క్రితం వీరిద్దరు కనిపించకుండా పోయారు. దీంతో అందులోని ఒక యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జంటగా పోలీసుల వద్దకు వచ్చిన ఆ యువతులు.. తాము వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..
జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఆ అమ్మాయిలలో ఒకరి తండ్రి ఐజీఆర్ఎస్ పోర్టల్ (IGRS Poratl) ద్వారా ఫిర్యాదు చేశారు. తన కూతురిని మరో గ్రామంలో (టిటావి గ్రామం) నివసించే కజిన్ ఆకర్షించి తీసుకెళ్లిందని ఆరోపించారు. ఆమె తన కూతుర్ని ఎక్కడో అమ్మేసిందన్న అనుమానాన్ని సైతం వ్యక్తం చేశారు. ఆ తండ్రి ఫిర్యాదు లక్నో పోలీసుల వద్దకు చేరుకోగా వారు దర్యాప్తు ప్రారంభించారు. అదృశ్యమైన అమ్మాయి ఆచూకిని కనిపెట్టారు. ఆమె వెలుగులోకి వస్తే రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

వధూవరులుగా స్టేషన్‌కు..
పోలీసులు హామీ ఇవ్వడంటో ఆగస్టు 7న వారిద్దరు పోలీసు స్టేషన్ కు వచ్చారు. వారిలో ఒకరు వరుడు వేషధారణలో ఉండగా.. మరొకరు నుదుటిన కుంకుమతో ఉన్నారు. అయితే పోలీసుల పిలుపు మేరకు అప్పటికే యువతుల కుటుంబ సభ్యులు సైతం స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా.. యువతులు తమ వాదనను పోలీసులకు వినిపించారు. తామిద్దరం గత ఏడాదిన్నరగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని.. పోలీస్ స్టేషన్‌కి రావడానికి ముందే ఆలయంలో పెళ్లి కూడా చేసుకున్నామని వెల్లడించారు.

బంధువులు నచ్చజెప్పినా..
అనంతరం ఇద్దరు యువతులకు వారి కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకోవడం సరైన నిర్ణయం కాదని.. తిరిగి తమతో పాటు ఇంటికి వచ్చేయాలని కోరారు. కానీ వారు అందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు.. ఆ యువతుల నిర్ణయాన్ని గౌరవిస్తూ సురక్షితంగా వదిలివేశారు. ఇద్దరు మేజర్లు అయినందువల్ల వారి విషయంలో కలుగచేసుకోవద్దని కుటుంబ సభ్యులను హెచ్చరించారు.

అప్పుడు సిస్టర్స్.. ఇప్పుడు కపుల్స్!
ఓ నివేదిక ప్రకారం.. వారిలో చిన్నదైన యువతి ప్రస్తుతం అబ్బాయిగా జీవిస్తోంది. ఆమె ఇంటర్ పూర్తి చేయగా.. మరో యువతి పదో తరగతి వరకూ చదువుకుంది. అంతకుముందు తామిద్దరం తమను తాము ‘అక్కాచెల్లెల్లమని’ భావించేవాళ్లమని.. ఇప్పుడు ‘జీవిత భాగస్వాములు’గా ఫీలవుతున్నామని ఓ యువతి తెలిపింది. తాము ఇప్పటికే దాంపత్య జీవితాన్ని ప్రారంభించామని పేర్కొంది. కాబట్టి తమను ఇలా వదిలేయాలని పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేసింది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సింగిల్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయిలు ఇలా ఒకరినొకరు పెళ్లి చేసుకుంటే తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.

Also Read: Huma Qureshi Cousin: పార్కింగ్ లొల్లి.. స్టార్ నటి కజిన్ దారుణ హత్య.. ఇలా ఉన్నారేంట్రా..!

యువతుల వివాహం చెల్లుబాటవుతుందా?
భారతదేశంలో ఒకే లింగానికి చెందిన వారి వివాహం చట్టబద్ధం కాదు. ప్రస్తుత చట్టం ప్రకారం వివాహం అనేది పురుషుడు – మహిళ మధ్య ఉన్న బంధంగా నిర్వచించారు. అయితే 2018లో సుప్రీంకోర్టు ఓ కేసులో తీర్పు చెబుతూ.. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను రద్దు చేసింది. పరస్పర సమ్మతితో ఉండే సమలింగ సంబంధాలను నేరం కాదని ప్రకటించింది. అయితే ఈ తీర్పు సమలింగ జంటలకు వివాహ హక్కును ఇవ్వలేదు.

Also Read This: TGSRTC Job Posts: త్వరలోనే పోస్టుల భర్తీకి కసరత్తు.. సజ్జనార్ స్పష్టం!

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు