Drugs Seized( image Creit: swetcha reporter)
క్రైమ్, హైదరాబాద్

Drugs Seized: డ్రగ్స్ దందాపై ఎక్సైజ్ దాడులు.. ఎండీఎంఏ గంజాయి స్వాధీనం

Drugs Seized: ఎక్సైజ్ అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎండీఎంఏ డ్రగ్‌తో పాటు పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. శేరిలింగంపల్లిలో బెంగళూరుకు చెందిన సాండ్ అనే డ్రగ్స్ పెడ్లర్, కడపకు చెందిన గుత్తా తేజకృష్ణకు 5.14 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను అమ్ముతుండగా శేరిలింగంపల్లి( Śēriliṅgampalli) వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

 Also Read: National Handloom Day: చేనేత దుస్తులు దరిద్దాం.. కార్మికులను కాపాడుకుందాం!

చైతన్యపురిలో..
విశ్వసనీయ సమాచారం మేరకు చైతన్యపురిలో దాడులు చేసిన ఎక్సైజ్ అధికారులు భూక్యా శ్రీకాంత్(Bhukya Srikanth) అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 340 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు అబ్బాస్ అనే మరో నిందితుడి ఇంటిపై దాడి చేసి 850 గ్రాముల గంజాయిని, నడిమింటి మమత అనే మహిళ ఇంటి నుంచి 10.683 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భూక్యా శ్రీకాంత్, నడిమింటి మమత, అబ్బాస్ లను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు షేక్ రిజ్వాన్ పరారీలో ఉన్నాడు.

మల్కాజిగిరి, ఘట్‌కేసర్‌లో..
మల్కాజిగిరిలో మరో గంజాయి విక్రేత మహేశ్ రెడ్డిని అరెస్ట్ చేసి అతని నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఘట్‌కేసర్‌(, Ghatkesar)లో నాగ్ పూర్ నుంచి బస్సులో గంజాయి తరలిస్తున్న ప్రభురాజ్ అనే వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంచి 1.227 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 Also Read: Gold Rate Today: అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఎంత పెరిగిందంటే?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!