Khammam district(image CREDIT: swetcha rep[orter)
నార్త్ తెలంగాణ

Khammam district: బర్త్ సర్టిఫికెట్ అడిగితే.. డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులు

Khammam district: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లో జనన ధృవీకరణ(Birth Certificate) పత్రానికి దరఖాస్తు చేసుకుంటే మరణ ధృవీకరణ (Death Certificate )పత్రం మంజూరు చేసిన ఘటన మండల తహసీల్దార్ కార్యాలయం(Tahsildar’s Office)లో చోటుచేసుకుంది. ఇదేమిటని అడిగితే దరఖాస్తుదారుకు సమాధానం కూడా సరిగా చెప్పకపోగా, ఇది ఇవ్వడమే ఎక్కువని, ఎక్కువ మాట్లాడితే కార్యాలయం నుండి బయటికి పంపిస్తానని దురుసుగా మాట్లాడినట్లు బాధితులు వాపోతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్, లక్ష్మి(Upender, Lakshmi) (మమత) దంపతులు. 2022 నవంబర్ 12న లక్ష్మి (మమత) కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ కాన్పులో ఆడబిడ్డకి జన్మించింది. దీంతో బిడ్డకు జనన ధృవీకరణ పత్రం కోసం సంబంధిత పత్రాలన్నీ తీసుకుని దరఖాస్తు చేసుకున్నారు.

Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా

జనన ద్రువీకరణ తప్పనిసరి

తహసీల్దార్ కార్యాలయం(Tahsildar’s Office) సిబ్బంది ఆన్ లైన్ లో ఎలాంటి లేవని తెలపడంతో, తమ కూతురు కడారి మాదవిద్యకు ఆధార్ కార్డు తీయించాలంటే జనన ద్రువీకరణ(Birth Certificate) తప్పనిసరి కావడంతో కూసుమంచి పంచాయితీ కార్యాలయంలో సంప్రదించి విషయం తెలపగా పంచాయితి కార్యదర్శి ఇంకా మావద్దకు వివరాలు రాలేదు. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి మేమే మీకు కాల్ చేసి విషయం తెలుపుతామని చెప్పారు. దీంతో కొన్ని రోజుల తరువాత మళ్లీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగీ తిరిగీ విసుగు చెందారు.

అధికారుల ఫై చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ ఆసుపత్రి కాన్పు సర్టిఫికెట్ ఉన్నా సరే అధికారులు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. తహసీల్దార్(Tahsildar’s Office) కార్యాలయానికి వచ్చి తమ కూతురుకు సంబంధించిన జనన ధృవీకరణ పత్రం అడగగా సంబంధిత విభాగంలో విధులు నిర్వర్తించే గువ్వల వెంకటేశ్వర్లు అనే ఉద్యోగి సదరు మహిళకు దృవీకరణ పత్రం అందజేశారు. జనన ధృవీకరణ(Birth Certificate) పత్రానికి బదులు మరణ ధృవీకరణ (Death Certificate ) పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయం (Tahsildar’s Office) సిబ్బంది మంజూరు చేశారు. అధికారుల ఫై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!