Heavy Rains: ఉన్నట్టుండి కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని నీళ్లతో ముంచెత్తుతున్నాయి. పలు చోట్ల రహదారులపై మోకాలు లోతు వరకు నీళ్లు నిలబడి పోతుండగా లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. విద్యుత్ సరఫరాకు కూడా అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నగరవాసులు సహాయం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.
Also Read: Medical Students Drugs: మెడికోస్ గంజాయి మత్తులో.. కోటిన్నర టర్నోవర్ కలిగిన మహిళా పెడ్లర్ అరెస్ట్
ఎన్డీఆర్ఎఫ్ 8333068536
పోలీస్ కమాండ్ కంట్రోల్ 8712596108
హైడ్రా 9154170992
ట్రాఫిక్ 8712660600
సైబరాబాద్ కమిషనరేట్ 8500411111
రాచకొండ కమిషనరేట్ 8712662999
టీజీఎస్పీడీసీఎల్ 7901530966
ఆర్టీసీ 9444097000
జీహెచ్ఎంసీ 8125971221
వాటర్ వర్క్స్ 9949930003
Also Read:Rahul Gandhi: ఓట్ల దోపిడీపై ఆధారాలు ఇవిగో.. డేటా ప్రకటించిన రాహుల్ గాంధీ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం చీకటి పడిన తర్వాత నగరంలో భారీ వర్షం కురవనున్నట్లు ఇటీవలే జీహెచ్ఎంసీ నియమించుకున్న వాతావరణ నిపుణలు అలర్ట్ జారీ చేశారు. నిపుణుల అలర్ట్ ప్రకారం వర్షాలు కురుస్తున్నందున జీహెచ్ఎంసీ, హైడ్రాలు ముందుగానే అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు సుమారు 5 నుంచి 15 మి.మీ.ల వర్షపాతం నమోదవుతుందని నిపుణలు హెచ్చరించారు.
రాత్రంత వర్షం కురిసే అవకాశముందన్న అలర్ట్ రావడంతో జీహెచ్ఎంసీ, పోలీసు, హైడ్రా, జలమండలి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు రంగంలోకి దిగాయి. హైడ్రా, జలమండలి టీమ్‌లు వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీటిని తోడేసే విధుల్లో నిమగ్నమయ్యాయి. నిపుణుల అలర్ట్ ప్రకారం మద్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఓ జల్లు కురిసిన వర్షం, సాయంత్రం ఆరు గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై సిటీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కుండ పోత వర్షం కురిసింది.
దాదాపు గంట సేపు వర్షం దంచికొట్టడంతో నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్, ఖైరతాబాద్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్ పేట, బేగంపేట, ఎస్.ఆర్.నగర్, బోరబండ, సికింద్రాబాద్, చార్మినార్, దోమల్ గూడ, నారాయణగూడ, ఉప్పల్, అంబర్ పేట, రాజేంద్రనగర్, మణికొండ, రాయదుర్గం, శంషాబాద్, కాచిగూడ, హిమయత్ నగర్ ప్రాంతాలతో గాలిదుమారంతో వర్షం కురిసింది. వీటితో పాటు ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్‌లో దాదాపు గంటసేపు కుండపోత వర్షం కురిసింది.
చాలా ప్ర్రాంతాల్లో మెయిన్ రోడ్లపై వర్షపు నీరు ఎక్కడికక్కడే నిల్చిపోయాయి. మణికొండ, మాదాపూర్, అమీర్‌పేట, బోరబండ ప్రాంతాల్లోని పలు భవనాల సెల్లార్లలోకి వర్షపు నీరు ప్రవహించి, పార్కింగ్ చేసిన వాహనాలు నీట మునిగాయి. ఖైరతాబాద్, అమీర్‌పేట మైత్రివనం చౌరస్తా చిన్న పాటి చెరువులను తలపించాయి. మెహిదీపట్నం నుంచి లింగంపల్లి వరకు, సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వరకు ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిల్చిపోయింది. తెలుగు తల్లి, ఖైరతాబాద్, బేగంపేట, మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్లపై వాహనాలు ఎక్కడికక్కడే జామ్ అయ్యాయి.
సహాయక చర్యలపై మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్ నగరంలో గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా సహాయక చర్యలపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, పోలీసు శాఖతో సమీక్ష నిర్వహించారు. సిటీలో ఇప్పటికే గుర్తించిన మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ఎక్కడా కూడా నీరు నిల్వగుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రెండురోజుల వర్షం అలర్ట్‌తో దాదాపు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఫీల్డు లెవల్‌లోనే విధులు నిర్వర్తిస్తూ, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
గచ్చిబౌలిలో అత్యధికంగా 8.5 సెం.మీ.ల వర్షపాతం
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గంటకు సుమారు 5 నుంచి 15 మి.మీ.ల వర్షపాతం నమోదవుతుందని నిపుణుల హెచ్చరించినా, నిపుణుల అలర్ట్‌ను మించి వర్షం కురిసింది. సిటీలో అత్యధికంగా గచ్చిబౌలిలో 8.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, శ్రీనగర్ కాలనీలో 6.3, ఖైరతాబాద్ లో 5.6, రాయదుర్గంలో 5.2, అమీర్ పేటలో 4.9, గోల్కొండలో4.6, యూసుఫ్‌గూడలో 4.4 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Also Read: Bjp Ramchander Rao: ఇటు పార్టీ.. అటు ప్రజా సమస్యలు.. ఒకే సమయంలో రెండింటిపై ఫోకస్