Rakhi Gift for PM Modi: రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు యావత్ దేశం సిద్ధమవుతోంది. శుక్రవారం (ఆగస్టు 8) రాఖీ పూర్ణిమ కావడంతో సోదరిమణులు.. తమ సోదరుడికి రాఖీ కట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే అనూహ్యంగా పాక్ మహిళ (Pak Women) సైతం.. ప్రధాని మోదీ (Prime Minister Modi)కి రాఖీ కట్టేందుకు సిద్ధం కావడం యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అసలే పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పాక్ మహిళ.. మోదీకి రాఖీ కట్టడం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
వివరాల్లోకి వెళ్తే..
పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించిన క్వామర్ మెుహ్సిన్ షేక్ (Qamar Mohsin Sheikh) ప్రస్తుతం భారత్ లో స్థిరపడ్డారు. గత మూడు దశాబ్దాలుగా (30 ఏళ్లు) ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె రాఖీ కడుతూ వస్తున్నారు. ఇది మతానికి, జాతీయతకు మించిన అనుబంధానికి చిహ్నమని పాక్ మహిళ అంటున్నారు. గత కొన్నేళ్లుగా స్వయంగా చేతితో తయారు చేసిన రాఖీని మోదీకి పంపుతున్నట్లు క్వామర్ షేక్ తెలిపారు. ఈ ఏడాది కడుతున్న రాఖీని ‘ఓం చిహ్నం’ (OM symbol Rakhee)తో పంపినట్లు ఆమె స్పష్టం చేశారు.
క్వామర్ ఏమన్నారంటే..
‘ప్రతి ఏడాది రాఖీ పండగకు ముందు అనేక రాఖీలు నేనే తయారు చేస్తాను. వాటిలో నాకు నచ్చినదాన్ని చివరికి మోదీగారికి కడతాను’ అని ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈసారి మోదీని ప్రత్యక్షంగా కలవాలనుకుంటున్నానని.. ఇందుకోసం ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే క్వామర్ షేక్ – మోదీ మధ్య అనుబంధం 1990లో మెుదలైంది. అప్పటి గుజరాత్ గవర్నర్ డాక్టర్ స్వరూప్ సింగ్ ద్వారా ఆమెకు మోదీతో పరిచయమైంది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అన్నా-చెల్లెలు బంధం కొనసాగుతు వస్తోంది.
VIDEO | As Rakshabandhan approaches, Qamar Mohsin Sheikh, a Pakistani-origin woman living in Ahmedabad, is once again preparing to tie a handmade rakhi to Prime Minister Narendra Modi, continuing a unique tradition that has lasted around 30 years.
Every year, Sheikh crafts… pic.twitter.com/SMWi5iPyc6
— Press Trust of India (@PTI_News) August 6, 2025
Also Read: No Helmet No Petrol: బిగ్ అలర్ట్.. కొత్త రూల్స్ వచ్చేశాయ్.. హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్!
మోదీ విషయంలో ప్రార్థనలు ఫలించాయ్!
కొవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలో ఉన్న పరిమితుల కారణంగా రెండేళ్లపాటు మోదీకి రాఖీ కట్టలేకపోయినట్లు క్వామర్ షేక్ తెలిపారు. గతేడాది (2024) ఢిల్లీకి భర్తతో కలిసి వెళ్లి మరి మోదీకి రాఖీ కట్టినట్లు ఆమె పేర్కొన్నారు. మోదీతో తనకున్న బంధాన్ని ప్రేమ, శ్రేయస్సు, ఆధ్యాత్మిక మద్దతుగా ఆమె అభివర్ణించారు. ‘సోదరుడు మోదీ మంచి ఆరోగ్యంతో ఉండాలి. ఇంకా ఎక్కువకాలం దేశ సేవ చేయాలి’ అని క్వామర్ షేక్ ఆకాంక్షించారు. మోదీతో పరిచయం తర్వాత అతడు సీఎం కావాలని.. ఆ తర్వాత పీఎం కావాలని కోరుకున్నానని.. తన ప్రార్థనలు ఫలించాయని క్వామర్ షేక్ తెలిపారు.