Swetcha Effect: ఖమ్మం కలెక్టరేట్ లో డ్రైవర్ దందాలు కదనానికి విశేష స్పందన లభించింది. ఖమ్మం కలెక్టరేట్(Khammam Collectorate) లో అధికారుల మాటలు రికార్డు చేస్తూ బ్లాక్ మెయిల్ లకు పాల్పడుతున్న డ్రైవర్ జానీ మియా(Jani Miya) పై యాక్షన్ తీసుకునేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. విధుల్లో సర్వీస్ రూల్స్ ఉల్లంఘిస్తూ చేస్తున్న చర్యలకు కలెక్టరేట్ అధికారులు పూర్తిస్థాయిలో స్పందించి డ్రైవర్ (Driver)పై యాక్షన్ తీసుకునేందుకు ప్రణాళిక చేస్తున్నారు. కలెక్టరేట్(Collectorate)వాహనాల్లో డీజిల్ బిల్లులలో కూడా అక్రమాలు జరిగిన విషయాన్ని అధికారులు పసిగట్టారు.
Also Read:TS News: ఖమ్మం కలెక్టరేట్‌లో డ్రైవర్.. ఎవరూ ఊహించని పనులు!
స్వేచ్ఛ కళ్ళకు కట్టినట్టుగా ప్రచురితం
డ్రైవర్ (Driver)పై పూర్తిస్థాయిలో విచారణ సాగించాలని కిందిస్థాయి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న అదనపు కలెక్టర్((Additional Collector0 డ్రైవర్ షేక్ జానీ మియా(Jani Miya) పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యాన్ని స్వేచ్ఛ (SWETCHA)కథనాన్ని ప్రచురించింది. సదరు డ్రైవర్ పైరవీలు చేస్తూ అడ్డు తగిలిన అధికారులు, సిబ్బందిని బ్లాక్ మెయిల్ కు గురి చేస్తూ ఇబ్బందులను పెడుతున్న నేపథ్యాన్ని స్వేచ్ఛ కళ్ళకు కట్టినట్టుగా ప్రచురితం చేసింది. ఈ కథనంపై కలెక్టరేట్ ఉన్నత స్థాయి అధికారులు అదనపు కలెక్టర్ డ్రైవర్(Collector Driver))పై పూర్తిస్థాయి చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక రచించినట్లుగా సమాచారం.
జానీ మియా తన దందాలు
డ్రైవర్(Driver)) ప్రవర్తన సరిగా లేదని బదిలీని తిరస్కరించినప్పటికీ కొత్త కలెక్టర్ అనుదీప్(Collector Anudeep) వచ్చిన తర్వాత ఒత్తిడి తెచ్చి శాశ్వత బదిలీ చేయించుకున్నారని ఆరోపణలు నేపథ్యంలో కూడా విచారణ సాగనున్నట్లు తెలుస్తోంది. కలెక్టరేట్(Collectorate) కార్యాలయంలో జానీ మియా తన దందాలను ప్రారంభించిన నేపథ్యం మొత్తాన్ని విచారణ ద్వారా తెలుసుకునేందుకు కిందిస్థాయి అధికారులను ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులతో చనువుగా మాట్లాడుతూ వారి మాటలనే మొబైల్ లలో రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా కూడా కలెక్టర్ కార్యాలయంలో చర్చ సాగుతున్నట్లుగా సమాచారం. డ్రైవర్ (Driverబదిలీ చుట్టూ కూడా పలు అనుమానాలను కలెక్టరేట్(Collectorate) కార్యాలయ సిబ్బంది వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read:Gadwal district: వర్షాకాలంలో సూర్యుడి భగ భగలు.. వాన కోసం రైతన్నల ఎదురుచూపులు