UP Crime: భార్యలు తమ భర్తలను అతిదారుణంగా హత్య చేస్తున్న ఘటనలు దేశంలో ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో వారిని మట్టుబెట్టుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. భర్తను ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా ఓ భార్య హత్య చేసింది. కత్తితో పొడిచి.. శరీరంపై యాసిడ్ పోసి ప్రాణాలు తీసింది.
వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) అలీగఢ్ జిల్లా (Aligarh district)లో 29 ఏళ్ల యువకుడు యూసఫ్ ఖాన్ (Yusuf Khan)ను అతని భార్య తబస్సుమ్ (Tabassum), ఆమె ప్రియుడు డానిష్ (Danish) హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు యూసఫ్ చేతులు కట్టేసి, పొట్టలో కత్తితో పొడిచి చంపారు. అంతటితో ఆగకుండా భార్య తబస్సుమ్.. యూసుఫ్ మృతదేహంపై యాసిడ్ పోసి తర్వాత దానిని దహనం చేసింది. ఆ మృతదేహాన్ని కాస్గంజ్ జిల్లాలోని ఓ పాడుబడ్డ ఇటుక గని దగ్గర నిందితులు పడేసినట్లు పోలీసులు వివరించారు.
బంధువుల ఫిర్యాదుతో..
యూసఫ్ కనిపించకపోవడంతో.. జూలై 29న యూసఫ్ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. రోజువారిగా పనికి వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు.. యూసఫ్ కోసం గాలిస్తుండగా ఆగస్టు 4న పోలీసులకు ఓ ఇటుక గని పక్కన పొదల్లో కాలిపోయిన మృతదేహం దొరికింది. యాసిడ్ పోసి పూర్తిగా కాల్చడంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టం అయింది. చివరికి దుస్తులు, చెప్పుల ఆధారంగా మృతదేహం యూసఫ్‌దేనని నిర్ధారించారు.
వివాహేతర బంధం వల్లే..
యూసఫ్ హత్య కేసును అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేయగా.. భార్య తబస్సుమ్ కు డానిష్‌తో వివాహేతర బంధం (Extramarital Affair) ఉన్నట్లు తేలింది. డానిష్ తొలుత యూసుఫ్‌కు ఉద్యోగం కల్పిస్తానని స్నేహం చేసి ఆ తర్వాత తరుచూ వారి ఇంటికి వెళ్లేవాడని పోలీసులు పేర్కొన్నారు. అలా యూసఫ్ భార్య తబస్సుమ్ కు బాగా దగ్గరయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ విషయమై యూసఫ్, తబుస్సుమ్ మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని అన్నారు. భార్యను ఎన్నిసార్లు మందలించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని యూసఫ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Also Read: Naa anveshana: నా అన్వేష్ తో అలేఖ్య చిట్టి పికెల్స్ రమ్య.. సంచలనం రేపుతున్న ఆడియో కాల్
భార్య అరెస్టు.. పరారీలో ప్రియుడు
ఇదిలా ఉంటే యూసఫ్ హత్య నేపథ్యంలో భార్య తబస్సుమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే డానిష్ ఇంకా పరారీ (Danish absconding)లోనే ఉన్నాడు. ఈ హత్యకు యూసఫ్ కుటుంబ సభ్యులు సైతం సహికరించారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నాం’ అని చర్రా సర్కిల్ ఇన్ స్పెక్టర్ ధనంజయ్ తెలిపారు.