Gold Rate Today: దేశంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా పసిడే అందరికీ గుర్తుకు వస్తుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో పసిడి ఒక తిరుగులేని వస్తువుగా స్థానం సంపాదించింది. పసిడిని ధరించడం ద్వారా సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని చాలా మంది నమ్మకం. పెట్టుబడి మార్గానికి సైతం బెస్ట్ ఛాయిస్ కావడంతో పసిడికి డిమాండ్ ఎప్పటికీ ఉంటూనే వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పసిడి ధరలు మరోమారు పెరిగాయి. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం.
ఎంత పెరిగిందంటే?
దేశంలో పసిడి ధరలు మంగళవారం (5 ఆగస్టు, 2025) భారీగా పెరిగాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ.750 పెరిగింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి.. రూ.820 పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్.. రూ. 92,950 కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ను రూ.1,01,400 విక్రయిస్తున్నారు. మరోవైపు వెండి ధరలు సైతం ఇవాళ భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే కిలో వెండిపై రూ.2,000 పెరిగింది. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.1,15,000 పలుకుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)
❄️ హైదరాబాద్: రూ.1,01,400
❄️ విజయవాడ: రూ.1,01,400
❄️ విశాఖపట్టణం: రూ.1,01,400
❄️ వరంగల్: రూ.1,01,400
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)
❄️ హైదరాబాద్: రూ.92,950
❄️ విజయవాడ: రూ.92,950
❄️ విశాఖపట్టణం: రూ.92,950
❄️ వరంగల్: రూ.92,950
Also Read: Sri Satya Sai District: కాసేపట్లో ఫస్ట్ నైట్.. నవ వధువు ఆత్మహత్య.. ఏం జరిగిందంటే?
వెండి (1 కిలో)
❄️ హైదరాబాద్: రూ.1,25,000
❄️ విజయవాడ: రూ.1,25,000
❄️ విశాఖపట్టణం: రూ.1,25,000
❄️ వరంగల్: రూ.1,25,000
Also Read This: Viral Video: ఇదేం వెర్రితనం.. సింహంతో చెలగాటమా.. అదృష్టం బాగుండి బయటపడ్డావ్ గానీ..!
Also Read This: Telangana PCB: ఆ శాఖలో అధికారులదే పెత్తనం.. మంత్రిని సైతం లెక్క చేయని వైనం..!