Telangana PCB (Image Source: Twitter)
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana PCB: ఆ శాఖలో అధికారులదే పెత్తనం.. మంత్రిని సైతం లెక్క చేయని వైనం..!

Telangana PCB: ఆ శాఖలో అధికారులదే పెత్తనం.. మంత్రి ఉన్నప్పటికీ తెలియకుండానే అధికారులే అన్ని పనులు చక్కదిద్దుతున్నారని సమాచారం. సమీక్షలకు సైతం అధికారులు సంబంధిత రికార్డులు లేకుండానే హాజరవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి ఆదేశాలు ఇచ్చినా పెడచెవిన పెడుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎం జోక్యం చేసుకుంటే తప్ప పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దారికి రాదు. రాష్ట్రంలో పలు కీలక శాఖల్లో తెలంగాణ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు (Telangana Pollution Control Board) ఒకటి. ఈ బోర్డు పూర్తిగా బ్యూరోక్రటిక్‌గా న‌డుస్తుంద‌నే విమర్శలు వస్తున్నాయి. ఆ బోర్డులో ప్రభుత్వం నుంచి మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఉన్నారు. మంత్రికి కూడా చెప్పకుండా అధికారులే ఫైళ్లు క్లియ‌ర్ చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు ఉద్యోగుల్లోనూ చర్చ జరుగుతుంది. అక్కడ అంతా అధికారుల‌దే హ‌వా.. వారు చెప్పిందే వేదం అన్నట్లుగా కొన‌సాగుతున్నదనే ప్రచారం జరుగుతున్నది. ఫైళ్లు క్లియర్ చేసుకోవడం వారికి ప‌రిపాటిగా మ‌రిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క‌ర్ణాట‌క‌లో పీసీబీలో స‌భ్యులుగా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. సమావేశాల్లోనూ పాల్గొని సూచనలు చేస్తారు. శాఖ మంత్రికి చెప్పి అక్కడి పీసీబీ అధికారులు శాఖ పరమైన పనులు చేపడతారు. కానీ, తెలంగాణ పీసీబీ అధికారులు మాత్రం ఇష్టారీతిన ప‌ని పనిచేస్తుండడంతో సంస్థపై తీవ్ర విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నారు.


ఏం జరుగుతుందో ఎవరికి అంతుచిక్కదు
పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏం జరుగుతుందో ఎవరికి అంతుచిక్కదు. బోర్డులో ఎవరు ఏం చేస్తారో కూడా తెలియదు. వారు కార్యాలయానికి వస్తారో రారో తెలియదు.. వచ్చినా వారు ఎప్పటివరకు విధులు నిర్వహిస్తోరో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నదని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. పొల్యూషన్ బోర్డు శాఖ మంత్రి సురేఖను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు, ఫైల్స్ కూడా మంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం లేదని సమాచారం. ఆ శాఖ ఉన్నతాధికారుల వ్యవహారశైలీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధిత శాఖ మంత్రి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన శాఖకు మంత్రిగా ఉన్నా.. ఆ శాఖలో జరిగే విషయాలు కూడా తెలియడం లేదు.. మంత్రి మాటంటే ఆ అధికారులకు లెక్కలేదని, మంత్రి సిఫార్సు లేఖలను సైతం వారు పట్టించుకోరని, శాఖ మంత్రి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మంత్రికి నివేదించే అధికారులే కరువు!
ప్రభుత్వంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓ విభాగం. ఆ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. దీంతో బోర్డులో ఏ నిర్ణయం తీసుకోవాలన్న సీఎస్ అనుమతితో పాటు బోర్డులో చర్చ జరగాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ పీసీబీలో ఏం జరుగుతుందో ఆ శాఖ మంత్రికి నివేదించే అధికారులే కరువయ్యారని సమాచారం. దీనికి తోడు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు సంబంధించి మంత్రి సూచనలు, సలహాలను ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయడం లేదని విస్తృత చర్చ జరుగుతున్నది. పీసీబీ చైర్మన్‌గా ఉన్న సీఎస్ రోజు వారి ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో పీసీబీ బోర్డు సమావేశాలకు హాజరు కావడం లేదనే ఆరోపలు ఉన్నాయి. ప్రస్తుత సీఎస్‌ను బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికీ మూడు సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని సమాచారం. కీలకమైన సమావేశాల్లో సీఎస్ బిజీగా ఉంటుండడంతో పీసీబీ కార్యక్రమాలపై ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోన్నదనే చర్చ జరుగుతున్నది.


Also Read: Ramachandra Rao: కాంగ్రెస్‌కు లోకల్ ఆలోచన లేదు.. రాంచందర్ రావు సంచలన కామెంట్స్!

అధికారులపై చర్యలకు ఉపక్రమిస్తారా?
పీసీబీ ఫైల్స్ కూడా మంత్రికి పంపడం లేదని..సెక్రటేరియట్‌లో నిర్వహించే సమీక్ష సమావేశాలకు మొక్కుబడిగా హాజరవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి సమీక్షలో కనీస సమాచారం లేకుండా అధికారులు హాజరై వెళ్తున్నారు తప్ప.. సమాచారంతో రావడం లేదని, ఆ తర్వాత మంత్రి కార్యాలయంకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని సమాచారం. పీసీబీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సదరు మంత్రి సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాల‌ని పలువురు కోరుతున్నారు. పీసీబీని గాడిలో పెడతారా? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది చూడాలి.

Also Read This: Viral Video: ఇదేం వెర్రితనం.. సింహంతో చెలగాటమా.. అదృష్టం బాగుండి బయటపడ్డావ్ గానీ..!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ