Weight Loss: బరువు తగ్గేందుకు (Weight Loss) చాలా మంది ప్రయత్నిస్తారు. కసరత్తులు కూడా ప్రారంభిస్తారు. కానీ, చాలామంది మధ్యలో ఆగిపోతారు. లేదా, ఆశించిన ఫలితాలు పొందలేరు. కారణాలు ఏమైనా కావొచ్చు కానీ మధ్యలోనే బరువు తగ్గే ప్రయత్నాలు మానుకుంటారు. చాలామంది కసరత్తులు చేయడంపై మీదనే దృష్టిపెడుతుంటారు. కానీ, కొవ్వును కరిగించడంలో తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించరు. బరువు తగ్గడంలో ఆహారం పాత్రను తెలియజేస్తూ ఇటీవలే నేహా అనే ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్ కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు. కేవలం 7 నెలల్లోనే 35 కేజీల బరువు ఏవిధంగా తగ్గిందో ఆమె వివరించారు.
బరువు తగ్గే ప్రక్రియలో తప్పనిసరిగా దూరమవ్వాల్సిన 10 ఆహార పదార్థాలను ఆమె వివరించారు. బరువు తగ్గే సమయంలో తాను కొన్ని ఆహార పదార్థాలను పూర్తిగా మానేయడంతోనే చక్కటి ఫలితం సాధించానని అన్నారు. “మీరు బరువు తగ్గాలంటే ఈ 10 ఆహారాలను పూర్తిగా మానేయాలి, లేదా వీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి” అని నేహా సూచించారు. అవేంటో మీరు కూడా తెలుసుకోండి.
1. గ్రనోలా (Granola)
ఓట్స్, తేనె, డ్రై ఫ్రూట్స్, నాట్స్ కలిపి కాల్చి తయారు చేసిన పాకం లాంటి ఆహార పదార్థమే ‘గ్రనోలా’. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇందులో ఎక్కువ చక్కెరతో పాటు అనారోగ్యకరమైన ఆయిల్స్ ఉంటాయి.
2. రుచికరమైన యోగర్ట్స్ (Flavoured Yoghurts)
ఫ్లేవర్ కలిపిన పెరుగులను ఫ్లేవర్డ్ యోగర్ట్స్ అంటారు. ఇందులో అధిక చక్కెర ఉంటుంది. వీటిని తింటే ఇన్సులిన్‌ను పెంచి, కొవ్వు నిల్వ అయ్యేలా చేస్తాయి.
3. ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ (Packaged Fruit Juices)
ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్.. ఫైబర్ లేకుండా, అధిక చక్కెరతో నిండిపోయి ఉంటాయి. అందుకే, ఇవి సోడా కంటే తక్కువ మేలు చేస్తాయి.
4. బేక్ చేసిన చిప్స్ (Diet Namkeen and Baked Chips)
డైట్ నమ్కీన్, బేక్డ్ చిప్స్‌ను ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా ప్రచారం చేస్తుంటారు. నిజానికి ఇవి ఎక్కువగా ప్రాసెస్ చేసినవి కావడంతో ఇందులో రీఫైన్ కార్బ్స్, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
5. ప్రోటీన్ బార్స్ (Protein Bars)
చాలా ప్రోటీన్ బార్స్‌ను గమనిస్తే, అవి కేవలం ప్రోటీన్ కలిపిన క్యాండి బార్లే. వీటిలో శరీరానికి ఉపయోగపడే ప్రోటీన్ కంటే చక్కెర, ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి.
Read Also- Business News: ఐపీవోకి వచ్చిన ఆకర్షణీయ కంపెనీ.. ప్రైస్ బ్యాండ్ ఎంతంటే?
6. తేనె-బెల్లం (Honey, Jaggery)
తేనె, బెల్లం సహజమైనవే అయినా కూడా చక్కెర మాదిరిగానే శరీరంలో పనిచేస్తాయి. ఇన్సులిన్‌ను వేగంగా పెంచి, కొవ్వు నిల్వ అయ్యేలా ప్రేరేపిస్తాయి.
7. బ్రౌన్ బ్రెడ్ (Brown Bread)
బ్రౌన్ బ్రెడ్‌ను ఎక్కువగా రంగు వేసిన మైదాతో తయారు చేస్తారు. ఇందులో పోషక ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయి.
8. స్మూదీస్ (స్టోర్‌లో కొనుగోలు చేసినవి)
పండ్ల మిక్స్ పానీయాన్ని స్మూదీస్ అని పిలుస్తారు. స్టోర్‌లో కొనుగోలు చేసినవి వాడకూడదు. ఇంట్లో తయారు చేసే స్మూదీస్‌ను మాత్రమే వాడాలి. అభిరుచికి తగ్గట్టుగానే వాటిని తయారు చేసుకోవచ్చు. అయితే, మార్కెట్లో లభ్యమయ్యే స్మూదీస్‌లో ఎక్కువగా ఫ్రూట్ చక్కెరలు, కృత్రిమ సువాసనలు ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు పెరగడానికి దోహదం చేస్తాయి.
Read Also- India Win: మాంచెస్టర్ టెస్టులో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. సిరీస్ సమం
9. లో-ఫ్యాట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ (Low-fat Packaged Foods)
లో-ఫ్యాట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్.. ఇలాంటి వాటిలో సహజ కొవ్వులను తొలగించి, వాటి స్థానంలో చక్కెరలు వేసి రుచిని పెంచుతారు. ఇవి ఆరోగ్యానికి నష్టం కలిగించవచ్చు.
10. సోయా ఉత్పత్తులు (ఎక్కువ తింటే)
అత్యధికంగా ప్రాసెస్ చేసిన సోయా ఉత్పత్తులను ఎక్కువగా తింటే శరీర హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. నూట్రీషన్ సోర్స్ (Nutrition Source) ప్రకారం, సోయా ఐసోఫ్లేవోన్లు శరీరంలో ఈస్ట్రోజన్ రెసెప్టర్లకు అనుసంధానమై, తక్కువ ఈస్ట్రోజన్ ప్రభావం లేదా వ్యతిరేక ప్రభావం చూపుతాయి. అందుకే, వీటిని ఎక్కువగా తినకూడదు.