Siraj: భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ‘అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ’లో చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ రసవత్తంగా మారేలా కనిపిస్తోంది. నాలుగ రోజు లంచ్ సమయానికి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు విజయానికి మరో 200లకు పైగా పరుగులు అవసరమవ్వగా.. ఆ జట్టు చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. హ్యారీ బ్రూక్, జో రూట్ కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లండ్ టీమ్ విన్నింగ్ రేసులో నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌పై పట్టు నిలుపుకునేందుకు కీలక వికెట్లు తీయడంలో భారత బౌలర్లు విఫలమవుతున్నాయి.
Read Also- Viral News: బాస్మతి రైస్‌పై డిస్కౌంట్ ప్రకటన.. మాల్‌లో ఊహించని సీన్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో లంచ్ సమయానికి కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. మూడింట్లో రెండు వికెట్లు భారత స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తీశాడు. దీంతో, చారిత్రాత్మక రికార్డు సాధించాడు. మాజీ దిగ్గజం కపిల్ దేవ్, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సరసన నిలిచాడు. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన తర్వాత ఇంగ్లండ్‌తో ప్రస్తుత టెస్టు సిరీస్‌లో సిరాజ్ 20 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో, ఒక టెస్ట్ సిరీస్‌లో 20 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో ఇప్పటివరకు కేవలం కపిల్ దేవ్ (6 సార్లు), జస్ప్రీత్ బుమ్రా (3 సార్లు) మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సిరాజ్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.
Read also- Parents: పిల్లలు బాగుండాలనే తపన తల్లిదండ్రులది.. మరి పిల్లల ఆలోచనా విధానం ఎలా ఉందంటే?
సిరాజ్ ఫీల్డింగ్ బ్లండర్..
బౌలింగ్‌లో రాణించిన పేసర్ మహ్మద్ సిరాజ్ ఫీల్డింగ్‌లో పెద్ద తప్పిదం చేశాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను చక్కగా పట్టుకున్నాడు. కానీ, వెనుకాలే ఉన్న బౌండరీ రోప్‌ను తాకాడు. దీంతో, ఔట్ కాస్తా సిక్సర్‌గా మారింది. ఈ క్యాచ్ మిస్ కావడంతో బ్రూక్‌కు లైఫ్ దక్కింది. దీంతో, భారత జట్టుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. సిరాజ్ తప్పిదం తర్వాత హ్యారీ బ్రూక్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో, ఐదో టెస్టు నాలుగో రోజు తొలి సెషన్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 44 ఓవర్లలో 200/3 స్కోర్‌తో పటిష్టంగా నిలిచింది. ఓవల్ మైదానంలో 374 పరుగుల రికార్డు టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆ దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం జో రూట్ 40 (బ్యాటింగ్), హ్యారీ బ్రూక్ 62 (బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కాగా, ఇంగ్లండ్ ప్లేయర్లు జాక్ క్రాలే (14), ఓల్లీ పోప్‌లను (27) సిరాజ్ ఔట్ చేశాడు. తాత్కాలిక కెప్టెన్ బెన్ డక్కెట్ (54) వికెట్‌ను ప్రసిద్ధ్ కృష్ణ తీశాడు.