Parents (imagecredit:twitter)
లైఫ్‌స్టైల్

Parents: పిల్లలు బాగుండాలనే తపన తల్లిదండ్రులది.. మరి పిల్లల ఆలోచనా విధానం ఎలా ఉందంటే?

Parents: పిల్లలు బాగుండాలనే తపన తప్ప మరి వేరే ఆలోచన లేనివారే తల్లిదండ్రులు(Parents), నీ తల్లి నిన్ను కన్నప్పుడు ఏడ్చి ఉండొచ్చు కానీ నిన్ను కన్నందుకు ఏడ్చే పరిస్థితి ఎన్నడూ రాకూడదు బిడ్డా! ఆడపిల్ల పుట్టడం భారమేమి కాదు. ఇంటికి వెలుగును తెచ్చే అదృష్టం ఆడపిల్ల ఉన్న ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది, ఆడపిల్ల లేని ఇల్లు విలవిలలాడుతూ ఉంటుంది. తల్లి జన్మనిచ్చేటప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాలను ఇస్తుందో అప్పుడే జీవితం పుడుతుంది. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను తాము అనుభవిస్తున్న కష్టాలను వారికి తెలియకుండా పెంచుతుంటారు పిల్లల ఎదుగుదలకు వారి శరీరాన్ని అమ్ముకొని మరి లక్షల్లో ఫీజులు కట్టి పై చదువులు చదివిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంటారు.

వెళ్లి ఏదో సాధిస్తారు అనుకుంటే
బిడ్డ కడుపులో ఉన్నప్పుడు అడ్డు తిరగొచ్చేమో కానీ అదే ఇరువై ఏళ్ల వయసు వచ్చాక బిడ్డ అడ్డు తిరిగే దుస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఇటీవలె కాలంలో పిల్లలు తల్లిదండ్రుల కష్టాలను పెంచిన ఇష్టాలను మరిచి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న తీరు కొందరి తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగులుచుతున్నాయి. ఉన్నత చదువులకై పల్లెటూరు(Village) వదిలి పట్టణాల(Towns)కు వెళ్లి ఏదో సాధిస్తారు అనుకుంటే తెలిసి తెలియని వయసులో ప్రేమ దోమ(Love) అంటూ పాతికేళ్లు పెంచిన తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగులుస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలుచోట్ల ఆడపిల్లలపై అనేక అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ వారిలో చైతన్యం రాకపోవడం జల్సాలకు అలవాటు పడటం మన అనుకునే వారు అందుబాటులో లేకపోవడంతో సినిమాలు(Movies), పబ్బులు(Pubs), పార్కుల్లో(Park) తిరుగుతూ వారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు వారి తల్లిదండ్రుల ఆశయాలను కూడా చంపేస్తున్నారు.

Also Read: Sports Grounds: రాష్ట్రంలో అలంకార ప్రాయంగా క్రీడా మైదానాలు

ఆనందాన్ని ఎందుకు కోరుకోవట్లేదు
ఎన్నో ఆశలు పెట్టుకొని నా కూతురు డాక్టర్(Doctor) కావాలి, నా కొడుకు పోలీస్(Police) కావాలి అన్న తల్లిదండ్రుల కలలను కలగానే మిగులుస్తున్న పిల్లలు. నాన్న ఊర్లో ఏదైనా జాతర జరుగుతుంటే తన పిల్లలను భుజాలపై ఎక్కించుకొని జాతరంతా తిప్పి చూపించి మరి పిల్లల ఆనందానికి పాటుపడుతుంటాడు. అదే పిల్లలు తల్లిదండ్రుల ఆనందాన్ని ఎందుకు కోరుకోవట్లేదు తల్లిదండ్రుల కష్టాన్ని ఎందుకు గుర్తించటం లేదు. తండ్రి(Father) పల్లెటూరు వదిలి పిల్లల కోసం పట్టణం వస్తే పది నిమిషాలు పట్టణం చూపించి తల్లిదండ్రులతో ఒక మంచి ఫోటో దిగని దుస్థితి అంతేకాకుండా ఒక పూట కడుపునిండా వండి అన్నం పెట్టలేని దౌర్భాగ్య స్థితి. ఆన్లైన్లో ఆర్డర్(Onine Order) పెట్టి కడుపునిండా తినమని సాంప్రదాయం దాపరించడం సిగ్గుచేటు. టెక్నాలజీ ఎంత పెరిగితే అంత సులభతరం అవటం మంచిదే కానీ కడుపునిండా వండుకొని తినలేనంత టెక్నాలజీ పెరగటం విడ్డూరం. పిల్లలు తల్లిదండ్రులు బ్రతికుండగానే సంతోషపెట్టండి వాళ్లు పోయాక సమాధిపై రకరకాలు పెట్టిన ఫలితం ఉండదు.

Also Read: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సంచలనం.. గెస్ట్ హౌస్‌లో రూ.11కోట్లు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు