Spain Airport (Image Source: AI)
Viral, లేటెస్ట్ న్యూస్

Spain Airport: మీరేం తల్లిదండ్రులురా అయ్యా.. బిడ్డను అలా వదిలేశారు!

Spain Airport: స్పెయిన్‌లోని ఓ విమానాశ్రయంలో దారుణం చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలుడితో పాటు ఎయిర్ పోర్టుకు వచ్చిన తల్లిదండ్రులు.. బిడ్డను అర్థాంతరంగా ఎయిర్ పోర్ట్ లోనే వదిలేసి ఫ్లైట్ ఎక్కారు. ఈ విషయాన్ని ఎయిర్ ఆపరేషన్స్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న లిలియన్ (Lilian) అనే మహిళ.. టిక్ టాక్ లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఘటన యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది.

బాలుడ్ని ఆరా తీయగా..
లిలియన్ అనే మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి పాస్ పోర్ట్ (Passport) గడువు ముగిసినట్లు గుర్తించిన తల్లిదండ్రులు కుమారుడ్ని టెర్మినల్ వద్దే వదిలి తమ వెకేషన్ కు వెళ్లిపోయారు. ఎయిర్ పోర్టు అధికారులు ఆ బాలుడు ఒంటరిగా ఉండటాన్ని చూసి ఆరా తీయగా.. తన తల్లిదండ్రులు విమానంలో తమ స్వదేశానికి సెలవులకు వెళ్తున్నారని  సమాధానం ఇచ్చాడు.

ఓ బంధువుకు చెప్పి..
అయితే బాలుడ్ని టెర్మినల్ వద్ద వదిలేసిన తల్లిదండ్రులు వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చినట్లు లిలియన్ తెలిపారు. ఓ బంధువుకు ఫోన్ చేసి.. బిడ్డను తీసుకెళ్లమని సూచించారని పేర్కొన్నారు. ఆ బంధువు ఎయిర్ పోర్టుకు వచ్చి తీసుకెళ్లేవరకూ చిన్నారి అక్కడే వేచి ఉన్నాడని అమె తెలిపారు. అయితే తాను ఈ విషయాన్ని సాధారణంగా చూడలేకపోతున్నట్లు లిలియన్ చెప్పుకొచ్చారు.

Also Read: Kangana Ranaut: విదేశీయుడ్ని చూసి నేర్చుకోండి.. చాలా సిగ్గుచేటు.. నటి కంగనా!

ఇది అసాధారణం..
పాస్‌పోర్ట్ లేదా డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగా 10 ఏళ్ల కొడుకుని టెర్మినల్‌ వద్ద ఎలా వదిలేస్తారని లిలియన్.. బాలుడి తల్లిదండ్రులను ప్రశ్నించారు. తాను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా పనిచేస్తున్నానని.. తన వీధుల్లో ఎన్నో విషయాలను చూశానని ఆమె పేర్కొన్నారు. కానీ ఇలాంటి అనుభవం అసాధారణమైందని ఆమె చెప్పుకొచ్చారు. బిడ్డను అలా వదిలేయడానికి ఆ తల్లిదండ్రులకు ఎలా మనసు వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read This: Fat Burn Tips: కష్టపడకుండానే బరువు తగ్గాలా? ఈ పవర్ ఫుల్ డ్రింక్స్ తాగేయండి!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..