Food in Tribal School: దమ్మపేట మండల పరిధిలోని ఆశ్రమ పాఠశాల(Ashram school)ల విద్యార్దులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వం గిరిజన విద్యార్ధుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న విద్యార్దులు మాత్రం అర్ధాకలితో కడుపునింపుకోవాల్సిన పరిస్థితులే అన్నిచోట్ల దర్శనం ఇస్తున్నాయి. తాజాగా దమ్మపేట మండలం చీపురుగూడెం(Cheepurugudem) గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తమకు పాఠశాలలో ఫుడ్ మెనూ(Food Menu) ఫాలో కావటం లేదని అన్నం తినేందుకు కూడా వీలులేకుండా ఉంటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వారానికి ఒకసారి వండే చికెన్(Chiken) సైతం వాసన వస్తుందని, సాంబారులో నీళ్లు కలిపి వడ్డిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తున్నారని విద్యార్దులు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో బయటకు విడుదల కావటంతో విషయం ఆశ్రమ పాఠశాల నిర్వహణ లోపం వెలుగులోనికి వచ్చింది.
అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం
మండల కేంద్రంలోనే ఐటిడిఎ(ITDA) కు సంబంధించిన ఏటీడీఓ(ATDO) కార్యాలయం ఉన్నప్పటికీ మండలంలో ఆశ్రమ పాఠశాలలపై స్థానిక అధికారుల పర్యవేక్షణ మాత్రం కరువైనట్టుగా తెలుస్తుంది. కేవలం ఉన్నతాధికారుల పర్యటనలో ఫొటోలకు ఫోజులు ఇయ్యటం తప్ప చేసేది ఏమిలేదంటున్నారు. మండలంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలా నిర్వహణ ఎలా జరుగుతుంది.? వసతులు ఎలా ఉన్నాయి.? భోజనంలో నాణ్యత ఉంటుందా! లేదా? అనే వివరాలు తెలుసుకోవాల్సిన అధికారులు నామమాత్రపు పర్యటనలు చేస్తూ చేతులు దుపుకుంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read: Rahul Gandhi: డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్ గాంధీ!
ఆశ్రమ పాఠశాలల్లో అడుగడుగున అవినీతి
మండలంలోని ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై భారీగా ఆరోపణలు వినిపిస్తున్నాయి మండల పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలు(Government Hostels), ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అందించాల్సిన సన్నబియ్యం, గుడ్లు, కందిపప్పు, పంచదార, సబ్బులు, నోట్ పుస్తకాలు(Note Books) భారీగా పక్కదారి పడుతున్నయనే ఆరోపణలు మండలంలో వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆశ్రమ పాఠశాలకు కూరగాయలు మాంసం గుడ్లు(Eggs) పాలు(Milk) అందించే కాంట్రాక్ట్ సప్లయర్ తీరుపై కూడా బోలెడు విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు అండదండలతో సదరు సప్లయర్ ఇదే వ్యవస్థలో ఏళ్ళ తరబడి పాతుకుపోయిన తాను ఇచ్చిందే ఫుడ్ మెనూ(Food Menu) అన్నట్టుగా సాగుతుందని అంటున్నారు.
Also Read: Harish Rao: కాళేశ్వరానికి చిల్లు పెడతామంటే చూస్తూ ఊరుకోం