Warangal Crime: తాగుడుకు బానిసైన భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన బాలాజీ నగర్(Balaji Nagar)లో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ నగర్(Balaji Nagar)కు చెందిన ఆసిఫ్, అతని భార్య రేష్మ(Reshma)తో కలిసి నివసిస్తున్నారు. ఆసిఫ్ మద్యానికి బానిస కావడంతో తరచూ రేష్మ(Reshma)ను వేధిస్తుండేవాడు.
Also Read: Mahabubabad Crime: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. అడ్డు వస్తున్నాడని హత్య
ఇద్దరు చిన్నారులు అనాథలుగా
అతని వేధింపులు తట్టుకోలేక రేష్మ(Reshma) కొంతకాలం క్రితం తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. అయితే, మూడు రోజుల క్రితం ఆసిఫ్ ఆమె వద్దకు వెళ్లి కలిసి ఉందామని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి తిరిగి వచ్చిన రేష్మ(Reshma)ను రాత్రి గొంతు నులిమి చంపి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలైన రేష్మ(Reshma)కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి హత్యకు గురికావడం, తండ్రి పారిపోవడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. నిందితుడు ఆసిఫ్‌ను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Medchal District Crime: చాకలి ఐలమ్మ మనవరాలి హత్య.. కన్నతల్లినే చంపిన కూతురు!