Ponnam Prabhakar: అర్హులైన ప్రతి ఒక్కరికీ తెలంగాణలో రేషన్ కార్డు అందిస్తామని, ప్రజలకిచ్చిన హామీలన్ని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్(Khairatabad)నియోజకవర్గంలోని బంజారాహిల్స్(Banjara Hills)బంజారా భవన్‌లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)నాయకత్వంలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు(Ration cards)ఇస్తున్నామని తెలిపారు.
Also Read: Gadwal: గురుకుల హాస్టల్ సిబ్బందిపై వేటు
అలాగే తెలంగాణలోని 32 జిల్లాలో రేషన్ కార్డుల(Ration cards) పంపిణీ జరుగుతుందని, రేషన్ కార్డుల(Ration cards) ప్రక్రియ నిరంతరమని చెప్పారు. ‘హైదరాబాద్(‘Hyderabad’) జిల్లాలో సివిల్ సప్లైస్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో రేషన్ కార్డులు ఇస్తున్నాం. గతంలో దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేకుండేది. ప్రజా ప్రభుత్వం వచ్చాక పేదలందరకీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. గత పాలకులు గతంలో 5 లక్షల రేషన్ కార్డులు(Ration cards) తొలగించారు. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులు (Ration cards)అందిస్తున్నాం’ అని పొన్నం(Ponnam Prabhakar) వెల్లడించారు.
ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా..
‘ హైదరాబాద్‌లో 55 వేల 378 రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నాం. ఇంకా లక్షా రేషన్ కార్డుల(Ration cards) వెరిఫికేషన్ నడుస్తోంది. తద్వారా 3 లక్షల 79 వేల 249 రేషన్ కార్డులు(Ration cards) లబ్ది పొందనున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో 1953 కొత్తగా రేషన్ కార్డులు పంపిణీతో 7 వేల 435 మందికి లబ్ది పొందనున్నారు. ప్రజా సమస్యలు వినడం, వాటిని పరిష్కరించి, ప్రజలకు లబ్ది చేకూర్చటం మా ప్రభుత్వ బాధ్యత. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం. అలాగే సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతులకు రైతు భరోసా, రుణమాఫీ చేశాం. పేదలు సంతోషంగా ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటున్నారు. హైదరాబాద్ ప్రజలు అర్హత కలిగి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే దరఖాస్తు చేసుకోవాలి. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. హైదరాబాద్ ఇళ్ల నిర్మాణానికి ఒక స్పెషల్ పాలసీ తీసుకురానున్నాం’ అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Also Read: Child Marriage: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం!