Heavy Inflow: కృష్ణా ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుండడంతో నాగార్జున సాగర్ జలాశయం(Nagarjuna Sagar Reservoir)నిండుకుండను తలపిస్తున్నది. జలాశయానికి 2 లక్షల 50 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుండగా రిజర్వాయర్ నుంచి అంతే స్థాయిలో అవుట్ ఫ్లో కొనసాగిస్తున్నారు. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.20 అడుగులుగా ఉంది.
Also Read: Kaleshwaram Commission Report: సీఎం చేతికి కాళేశ్వరం నివేదిక
40 వేల క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.12 టీఎంసీలుగా ఉంది. స్పిల్ వే నుంచి నదిలోకి దాదాపు 2 లక్షల 10 వేల క్యూసెక్కులు వదులుతుండగా కుడి, ఎడమ, ఎస్సెల్బీసీ, లోలెవల్ కాలువలు, జల విద్యుత్ కేంద్రం నుంచి మరో 40 వేల క్యూసెక్కులు వెళ్తున్నది. మరోవైపు, క్రస్ట్ గేట్లు తెరవడంతో డ్యామ్ పరిసరాల్లో జన సందోహం కనిపిస్తున్నది. భద్రతా చర్యల్లో పోలీసు(Police)లు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎవరిని పడితే వారిని డ్యాం పైకి అనుమతిస్తున్నట్లు తెలిసింది.
Also Read: Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక ప్రకటన