Kaleshwaram Commission Report: కాళేశ్వరం కమిషన్ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు అందజేశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,(Bhatti Vikramarka) మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,(Uttam Kumar Reddy)పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సీఎంకు కాళేశ్వరంపై కమిషన్ చీఫ్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను నీటిపారుదల శాఖ సెక్రెటరీ ప్రశాంత్ పాటిల్, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం వారితో సమావేశమయ్యారు.
Also Read: Harish Rao: కాళేశ్వరానికి చిల్లు పెడతామంటే చూస్తూ ఊరుకోం
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కారణమని నివేదికలో కమిషన్ స్పష్టం చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఆర్థిక అవకతవకలు జరిగాయని నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం.
డీపీఆర్ రూపకల్పన
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి డీపీఆర్ రూపకల్పన నుంచి మేడిగడ్డలో పియర్స్ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు రావడం వరకు కమిషన్ చేసిన పరిశీలన, విచారణ వివరాలన్నింటినీ ఈ నివేదికలో పేర్కొన్నారు. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు కమిటీని ప్రభుత్వం నియమించింది. నీటిపారుదల శాఖ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర క్యాబినెట్(Cabinet)కు అందజేయనుంది.
Also Read: AV Ranganath Hydraa: నాలాల్లో నీటి ప్రవాహానికి ఆటంకాలుండొద్దు.. హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన