Harish Rao: గోదావరి, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Minister Thanniru Harish Rao)స్పష్టం చేశారు. ఏపీ కట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం, అనుమతులు తెచ్చుడు మీకు తెలిస్తే ఆపడం మాకు తెలుసు అని హెచ్చరించారు. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందని మండిపడ్డారు. లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం సహకరిస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీలో పవర్ ఉంది అని లోకేశ్(Lokesh)ప్రాజెక్టు కట్టి తీరుతాం అంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని నిలదీశారు. ఏ ధైర్యం చూసుకొని బనకచర్ల కట్టి తీరుతాం అని లోకేశ్(Lokesh) అంటున్నారని అడిగారు. బనకచర్లపై చంద్రబాబు బుల్డోజ్ విధానానికి బీజేపీ, కాంగ్రెస్ మౌనమే కారణం అని దుయ్యబట్టారు.
లోకేశ్ అర్థరహిత మాటలు
లోకేశ్అ(Lokesh)వగాహన లేకుండా మాట్లాడారని, అధికారం ఉందని, మంద బలం ఉందని మాట్లాడటం సరికాదన్నారు హరీశ్ రావు. (Harish Rao)మిగులు జలాలు అనేవి నిజంగా ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు డీపీఆర్‌ను వెనక్కి తిప్పి పంపింది అని నిలదీశారు. పోలవరం అథారిటీ, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ, పర్యావరణ సంస్థలు ఎందుకు బనకచర్ల డీపీఆర్‌ను తిరస్కరించాయన్నారు. నాలుగు కేంద్ర సంస్థలు బనకచర్లను తిప్పి పంపింది నిజం కాదా, మిగులు జలాలు ఉన్నాయని ఎవరు చెప్పారు, ఉంటే ఏపీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని కేటాయించారో చెప్పు అని ప్రశ్నించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎత్తిపోతలకు పొక్క కొట్టుడో, చిల్లు పెట్టుడో ఉండదన్నారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్(Congress) నాయకులు మౌనంగా ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లు నీళ్లు తీసుకుపోతా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
Also Read: Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ సినిమాకు జాతీయ అవార్డు