kesari (image source :x)
ఎంటర్‌టైన్మెంట్

Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ సినిమాకు జాతీయ అవార్డు

Bhagavanth Kesari: నట సింహం నందమూరి బాలకృష్ణ తన నటనతో జాతీయ స్థాయిలో గర్జించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘భగవంత్ కేసరి’ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు గెలుచుకుంది. 2023లో విడుదలైన ‘భగవంత్ కేసరి’ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ అవార్డు 2023 జనవరి 1 నుండి డిసెంబర్ 31 మధ్య CBFC ద్వారా సర్టిఫైడ్ అయిన చిత్రాలకు సంబంధించినది. ఈ అవార్డుల ప్రకటన 2025 ఆగస్టు 1న న్యూ ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో జరిగింది. సాహు గరపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై విడుదలైంది. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. బాలకృష్ణ నటన, యాక్షన్ సన్నివేశాలు, మహిళా సాధికారత సందేశం ఈ చిత్రానికి ప్రశంసలు తెచ్చాయి. అంతే కాకుండా ఈ చిత్రం మూడవ ఉత్తమ చలనచిత్రంగా రాష్ట్ర గద్దర్ అవార్డు కూడా అందుకుంది. బాలయ్య అభిమానులు ఈ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం “జై బాలయ్య” అంటూ ట్రెండ్ అవుతుంది.

Read also- Viral News: ఇంత దారుణమా? వాటర్ బాటిల్‌లో యురిన్..

‘భగవంత్ కేసరి’ జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకోవడంపై ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ‘71 జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా ‘భగవంత్ కేసరిని’ ఎంపిక చేసినందుకు నేషనల్ అవార్డు కమిటీకి, జ్యూరీ మెంబర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రయత్నానికి గొప్ప స్థాయిలో గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఓ సినిమాను ముందుకు తీసుకువెళ్లడంలో బాలయ్య బాబు ఎప్పుడు ముందే ఉంటారు. ఈ సినిమాకు పనిచేసిన టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవార్డులు వచ్చిన వేరే భాషల వారికి కూడా నా శుభాకాంక్షలు.

Read also- Supreme Court: అంత సున్నితత్వం ఎందుకు?.. బీజేపీ నేతపై సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు

‘భగవంత్ కేసరి’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాహు గరపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు తమన్ ఎస్ సంగీతం అదిరిపోయే సంగీతం అందించారు. సి. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్ వథ, వి. వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీతో రూపొందింది, బాలకృష్ణ నటన, యాక్షన్ సన్నివేశాలు మరియు మహిళా సాధికారత సందేశంతో 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా మరియు రాష్ట్ర గద్దర్ అవార్డులో మూడవ ఉత్తమ చిత్రంగా పురస్కారాలు గెలుచుకుంది.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు