Real Gold For That Role
Cinema

Hero Yash: ఆ రోల్‌ కోసం రియల్‌ గోల్డ్‌..! 

Real Gold For That Role: బీటౌన్​లో తెరకెక్కుతున్న హిస్టారికల్‌ మూవీ రామాయణ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వర్క్స్‌ శరవేగంగా నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ గురించి ఎన్నో వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే గతంలో రణ్​బీర్​, సాయిపల్లవికి సంబంధించిన షూటింగ్​ స్టిల్స్​ బయటకి రావడం వల్ల మేకర్స్​ కూడా చాలా జాగ్రత్తపడుతున్నారు. అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చేంతవరకు అన్నీ సీక్రెట్​గా ఉంచాలని భావిస్తున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే తాజాగా ఈ మూవీలో నటిస్తున్న యశ్​ పాత్ర గురించి ఓ రూమర్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ఇందులో రావణుడి రోల్‌లో కనిపించనున్న యశ్‌ కోసం మేకర్స్ భారీ సన్నాహాలే చేస్తున్నారట. తన రోల్‌కు సంబంధించిన చిన్న డీటైలింగ్​ కూడా గ్రాండ్​గా ఉండాలనుకుంటున్నారట. ఇందులో భాగంగానే తాను ధరించనున్న దుస్తులు, ఆభరణాలు, వాడే వస్తువులు అన్నీంటినీ నిజమైన బంగారంతో తయారు చేసినవే వినియోగించనున్నట్లు టాక్‌. రావణుడు స్వర్ణనగరమైన లంకాపురికి రాజు. అప్పట్లో ఆయన ధరించిన వస్త్రాలు కూడా బంగారుతో తయారుచేసినవని ఇతిహాసాల్లోనూ పేర్కొంది. అందుకే ఈ సినిమాలోనూ రావణుడి పాత్రను కూడా సేమ్‌ టూ సేమ్‌ అలాగే చూపించాలని మూవీ టీమ్​ ప్లాన్ చేస్తోందట.

Also Read:దేవర ఫియర్‌ సాంగ్, ఫ్యాన్స్‌కి పూనకాలే..!

ఇది విన్న ఫ్యాన్స్ ఒకింత షాకైనప్పటికీ, మేకర్స్ థాట్‌కి హ్యాట్సాఫ్​ చెప్తున్నారు. పలువురు యశ్​ లుక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో యశ్‌ కీలక పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రణ్​బీర్​, సాయి పల్లవితో పాటు యశ్​ కూడా షూట్​లో పాల్గొన్నారని సమాచారం. హనుమంతుడిగా సన్నీ దేఓల్ కనిపించనున్నారు. ఆయన కూడా ఈ సినిమా చిత్రీకరణకు వచ్చారట.మరోవైపు ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ.835 కోట్లు అని నెట్టింట టాక్ నడుస్తోంది. అది కూడా కేవలం తొలి భాగాన్ని తెరకెక్కించడం కోసమేనట. పాన్ ఇండియా లెవెల్​లో ఈ మూవీని 2025లోనే రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు జరిగాయి. కానీ ఇప్పుడు అది కాస్త 2027కి షిష్ట్​ అయ్యిందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ మూవీ దాదాపు 600 రోజులకు పైగా షూటింగ్ జరుపుకుంటుంది.

Just In

01

VV Vinayak: చాలా రోజుల తర్వాత దర్శకుడు వివి వినాయక్ ఇలా..!

Blast in Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లో పేలుడు.. పాక్‌లో షాకింగ్ ఘటన

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు