India Vs England
Viral, లేటెస్ట్ న్యూస్

Oval Test: భారత్-ఇంగ్లండ్ మధ్య మొదలైన 5వ టెస్ట్.. టీమ్‌లో 3 మార్పులు

Oval Test: సిరీస్‌ను డ్రాగా ముగించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌‌లో కూడా టీమిండియాను టాస్ వరించలేదు. ఈ సిరీస్‌లో వరుసగా ఐదవ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడిపోయింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య సిరీస్‌లో చివరిదైన ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ కెప్టెన్ ఓల్లి పోప్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ‘‘ మేము బౌలింగ్ ఎంచుకుంటున్నాం. ఆకాశం మేఘావృతంగా ఉండడంతో ఈ పిచ్‌పై బౌలింగ్‌తో ప్రారంభించడం మంచిదని భావిస్తున్నాం. మా కెప్టెన్ (బెన్ స్టోక్స్) ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కానీ, మిగతా ప్లేయర్లంతా మంచి ట్రాక్‌లో ఉన్నారు. కొత్త ఆటగాళ్లు కూడా సిద్ధంగా ఉన్నారు. చివరివరకు బ్యాటింగ్ చేయగల సత్తా మాకు ఉంది. గస్ అట్కిన్సన్, ఓవర్టన్‌ కూడా బ్యాట్‌ చేయడం చూశారు. ఈ మ్యాచ్‌ను డ్రా చేయాలని కాదు, గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం’’ అని ఓల్లీ పోప్ చెప్పాడు.

ఇంగ్లండ్ తుది జట్టు
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓల్లి పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రుక్, జేకబ్ బెత్‌హెల్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జాస్ టంగ్.

Read Also- Malegaon Case: మాలేగావ్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. బీజేపీ మాజీ ఎంపీ సహా అందరూ నిర్దోషులే

టీమిండియా 3 మార్పులు..
కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత జట్టు మూడు కీలకమైన మార్పులతో బరిలోకి దిగింది. రిషబ్ పంత్, శార్దూల్ థాకూర్, జస్ప్రీత్ బుమ్రా స్థానాల్లో జురేల్, కరుణ్ నాయర్, ప్రసిధ్‌ కృష్ణలను జట్టులోకి తీసుకున్నామని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. ‘‘మేము టాస్ ఓడినా పరవాలేదు, కానీ, మ్యాచ్ గెలిస్తే చాలు. ఆకాశం మేఘావృతంగా ఉండటంతో ఏం ఎంచుకోవాలనే దానిపై నిన్నంతా (బుధవారం) కొంచెం సందిగ్ధంగా అనిపించింది. కానీ, ఇప్పుడు పిచ్ మంచిగా అనిపిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మేము మంచి స్కోర్ సాధించాలనుకుంటున్నాం. బౌలర్లకు ఇదొక మంచి పిచ్ అవుతుందని భావిస్తున్నాం. ఇది చివరి మ్యాచ్ అని తెలుసు. అందుకే, మా బోయ్స్ చివరి మ్యాచ్‌లో శక్తిసామర్థ్యాలు కూడగట్టుకొని ఆడడానికి సిద్ధమయ్యారు’’ అని శుభ్‌మన్ గిల్ చెప్పారు.

భారత తుది జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.

Read Also- Viral News: కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం కోరుతూ అప్లికేషన్.. కలెక్టర్ ఏం చేశారంటే?

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..