Etela Rajender(image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Etela Rajender: రైల్వే లైన్ లేక భక్తులకు తిప్పలు.. పార్లమెంట్‌లో ప్రస్తావించిన ఈటల

Etela Rajender: సమ్మక్క సారలమ్మ జాతరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో  రూల్ 377 కింద ప్రస్తావించారు. ములుగు జిల్లా(Mulugu District) మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని తెలిపారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అని, తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర ఒరిస్సా నుంచి కోటి మంది భక్తులు జాతరకు వస్తారన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు రైల్వే లైన్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

 Also Read: India On US Tariff: ట్రంప్ టారిఫ్ లొల్లి.. దీటుగా బదులిస్తూ కేంద్రం సంచలన ప్రకటన!

అధ్యయనం చేయాలి

రోడ్డు ప్రయాణం ఎక్కువ ఖర్చుతో కూడినది, ట్రాఫిక్ జామ్ సమస్యలు, యాక్సిడెంట్ల వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దగ్గరలో ఉన్న వరంగల్ రైల్వే జంక్షన్,(Warangal Railway Junction,) సిర్పూర్ – కాగజ్‌నగర్, లేదా మణుగూరుకు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే గిరిజనులకు తక్కువ ఖర్చుతో భద్రతతో కూడా ప్రయాణం అందించగలమని పేర్కొన్నారు. బొగత జలపాతం, రామప్ప దేవాలయం కూడా ఉండడం వల్ల ఏకో టూరిజం కూడా డెవలప్ అవుతుందన్నారు. ఈ రైల్వే లైన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రిని కోరారు. అదే విధంగా కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారి(Nitin Gadkari)ని కలిశారు. ఎన్‌హెచ్ -65 చింతకుంట సర్కిల్ నుంచి ఆటోనగర్ చౌరస్తా వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని కోరారు. మంత్రి హామీ ఇచ్చినట్లు ఈటల(Etela Rajender) తెలిపారు.

 Also Read: Coolie: ‘కూలీ’ పవర్‌హౌస్ సాంగ్ తెలుగులో వచ్చేసింది.. టాక్ ఏంటంటే?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?