AP Liquor Scam( IMAGE credit: swetcha reporter)
హైదరాబాద్

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సంచలనం.. గెస్ట్ హౌస్‌లో రూ.11కోట్లు

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్​లిక్కర్​స్కాం తెలంగాణలో సైతం కలకలం రేపుతోంది. దీంట్లో నిందితునిగా ఉన్న వరుణ్‌ను ఏపీ సిట్ అధికారులు శంషాబాద్(Shamshabad) వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను వెల్లడించిన వివరాల మేరకు శంషాబాద్‌(Shamshabad)లోని ఓ గెస్ట్ హౌస్ నుంచి రూ.11 కోట్లు నగదును స్వాధీనం చేసుకున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా చెబుతున్న లిక్కర్ స్కాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తోంది.

Also Read:Journalism: నిజాయితీ జర్నలిజంపై కబ్జాకోరుల కుట్రలు సాగవు

రూ.11 కోట్ల నగదును సీజ్

ఇటీవల హైదరాబాద్‌(, Hyderabad)లోని వేర్వేరు చోట్ల సిట్​అధికారులు తనిఖీలు చేసి పలు డాక్యుమెంట్లను సైతం సీజ్​ చేశారు. తాజాగా, కేసులో 40వ నిందితునిగా ఉండి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వరుణ్‌ను అధికారులు శంషాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వరుణ్ వెల్లడించిన వివరాలతో శంషాబాద్‌లోని సులోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ నుంచి 12 అట్టపెట్టెల్లో దాచిపెట్టి ఉన్న రూ.11 కోట్ల నగదును సీజ్ చేశారు. ఈ డబ్బు కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి చెందినదిగా అధికారులు చెబుతున్నారు. రాజ్ కేసిరెడ్డి, చాణక్యల సూచనల మేరకే వరుణ్ 2024, జూన్‌లో ఆఫీస్ ఫైళ్లు అంటూ అట్టపెట్టెల్లో ఈ డబ్బును తెచ్చి ఇక్కడ పెట్టినట్టుగా భావిస్తున్నారు. కాగా, మద్యం కుంభకోణంలో దాదాపు రూ.3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్‌ ప్రాథమికంగా గుర్తించింది.

Also Read: Medchal highway: నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు.. రాకపోకలకు ఇబ్బందులు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!