GHMC WhatsApp Feature (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC WhatsApp Feature: గుడ్ న్యూస్.. ప్రాపర్టీ ట్యాక్స్ ట్రేడ్ లైసెన్స్‌ల చెల్లింపులో కొత్త విధానం

GHMC WhatsApp Feature: మారుతున్న ఆధునిక కాలానికి అనుగుణంగా జీహెచ్‌ఎంసీ కూడా అప్‌డేట్ అవుతుంది. డిజిటల్ చెల్లింపులను పెంచుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ(GHMC)కి ప్రధాన ఆర్థిక వనరులైన ప్రాపర్టీ ట్యాక్స్(Property tax), భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్‌(Trade license)ల చెల్లింపులను పౌరులకు సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టింది. జీహెచ్‌ఎంసీ త్వరలో వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల చెల్లింపు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ఫీజులను ఆన్‌లైన్‌లో, ఆర్‌టీజీఎస్(RTGS) ద్వారా సేకరిస్తున్న బల్దియా, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ విషయంలోనూ సిబ్బంది ప్రమేయాన్ని గణనీయంగా తగ్గించాలని భావిస్తుంది. ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలను యూపీఐ ద్వారా స్వీకరించే కొత్త విధానం మరింత మందికి చేరువవుతుందని అంచనా వేస్తున్నారు.

కొత్త విధానం అందుబాటులోకి
ఇది ప్రజలకు సులభతరం చేయడమే కాకుండా, జీహెచ్‌ఎంసీ(GHMC) ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ యూపీఐ(UPI) ద్వారా సేకరించాలన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఇకపై నగరవాసులు వాట్సాప్ యాప్(WhatsApp app) ద్వారానే ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులను చెల్లించే సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే, ట్యాక్స్(Tax) బకాయిలను గుర్తుచేయడంతో పాటు, ‘పే నౌ'(Pay Now) ఆప్షన్ కూడా అందుబాటులోకి తెచ్చి, బకాయిదారుడు కేవలం క్షణాల్లోనే పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలను చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయనుంది. దీని కోసం ఆసక్తి గల సంస్థల నుండి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ జీహెచ్‌ఎంసీ(GHMC) ఇటీవలే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది.

Also Read: Surrogacy: వెలుగు చూస్తున్న డాక్టర్ నమ్రత లీలలు.. రెండు రాష్ట్రాల్లో నెట్‌వర్క్

అక్రమాలకు చెక్
జీహెచ్‌ఎంసీ ప్రతి ఏడాది సుమారు ₹2 వేల కోట్ల ఆస్తిపన్నును వసూలు చేస్తుండగా, అందులో సగానికి పైగా ఆన్‌లైన్(Online) చెల్లింపుల ద్వారానే వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇకపై గూగుల్ పే(Google Pay) వంటివి అందుబాటులోకి తీసుకువస్తే కలెక్షన్ పెరిగి, సిబ్బంది ప్రమేయం తగ్గుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, పన్ను నగదులో కొందరు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు నగదును స్వీకరించి తమ సొంత అవసరాలకు వినియోగించుకుని, నెలాఖరులో జీహెచ్‌ఎంసీ(GHMC) ఖజానాలో జమ చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఈ రకంగా కొందరు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు భూములు, ఇళ్లు కొనుగోలు చేసిన ఘటనలు కూడా లేకపోలేదు. కొత్త విధానం ఈ అక్రమాలకు చెక్ పెడుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం పేటీఎం(Paytm), గూగుల్ పే(Google Pay), ఇతర యూపీఐ(UPI) యాప్‌లు, మై జీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్, జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారు. వీటికి తోడు వాట్సాప్ సేవలు అందుబాటులోకి వస్తే ఆన్‌లైన్ కలెక్షన్ మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

వాట్సాప్‌లో బిజినెస్ ఖాతా
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ(GHMC) ఆస్తిపన్ను బకాయిలు, చెల్లింపు గడువులు, ఓటీపీ(OTP)లు వంటి కీలక సమాచారాన్ని అందించడానికి ఏటా దాదాపు 20 లక్షల ఎస్ఎంఎస్‌(SMS)లను పంపిస్తుంది. దీనికి గాను ప్రతి వెయ్యి ఎస్ఎంఎస్ మెసేజ్‌లకు ₹52 చొప్పున భారీ మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ ఖర్చు చేస్తుంది. వాట్సాప్‌లో బిజినెస్ ఖాతా ద్వారా పన్నులు వసూలు చేస్తే, ఈ ఎస్ఎంఎస్ ఖర్చులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు వాట్సాప్ ద్వారా చెల్లించిన మొత్తాన్ని పేమెంట్ గేట్‌వే సేవలు అందించే బ్యాంకులు, సంస్థలు రెండు రోజుల పాటు తమ ఖాతాల్లో ఉంచుకొని వడ్డీని పొందుతాయి. ఈ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, వాట్సాప్ సేవలను జీహెచ్‌ఎంసీ(GHMC)కి ఉచితంగా అందించాలనే నిబంధనతో కొత్త చెల్లింపుల విధానాన్ని అమలు చేయడానికి జీహెచ్‌ఎంసీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ కొత్త విధానం ప్రజలకు పన్ను చెల్లింపులను మరింత సులభతరం చేయడమే కాకుండా, జీహెచ్‌ఎంసీకి ఖర్చులను కూడా ఆదా చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: Gadwal Surveyor Murder Case: సర్వేయర్ హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!