Hair Care Tips: వర్షాకాలంలో జట్టు అధికంగా రాలుతోందా?
Hair Care Tips (Image Source: Twitter)
Viral News, లేటెస్ట్ న్యూస్

Hair Care Tips: వర్షాకాలంలో జట్టు అధికంగా రాలుతోందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

Hair Care Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలా మందికి జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. గాలిలోని తేమ, కాలుష్యం జుట్టును తీవ్రంగా ప్రభావితం చేసి.. రాలిపోయేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మన్‌సూన్ సీజన్ (Monsoon Season)లో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా.. జుట్టు రాలడాన్ని నివారించడం మరింత కష్టతరంగా మారిపోవచ్చని చెబుతున్నారు. అయితే ఈ చిట్కాలను పాటిస్తే వర్షాకాలంలో జట్టును రాలడాన్ని నియంత్రించి.. సంరక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

వర్షపు నీటి నుండి జుట్టును రక్షించండి
ప్రస్తుత రోజుల్లో వర్షపు నీరు స్వచ్ఛంగా ఉండటం లేదు. గాలిలోని కాలుష్య కణాలు, దుమ్ము, ఆమ్ల కణాలతో వర్షపు నీరు కలుషితమవుతోంది. ఒకవేళ వర్షంలో గనుక తడిస్తే అది తలలోని pH సమతుల్యతను దెబ్బతీస్తుంది. జుట్టు మెరుపును తగ్గించి.. చుండ్రు సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ఫలితంగా జుట్టు అధికంగా రాలిపోయే ప్రమాదముంది. కాబట్టి వర్షంలో తడిసిన వెంటనే జట్టును శుభ్రమైన గోరువెచ్చని నీటితో కడిగితే తలలోని pH విలువ యథా స్థితిలోకి వస్తుంది.

రోజూ షాంపూ వాడటం మానేయండి
రోజూ షాంపుతో తల స్నానం చేయడం వల్ల జుట్టుకు అందే సహజ నూనెలు తొలగిపోతాయి. ఫలితంగా జుట్టు పొడిబారి దెబ్బతింటుంది. బదులుగా వారంలో 2-3 సార్లు మైల్డ్ షాంపూతో జట్టును కడిగితే మంచిది. మిగిలిన రోజుల్లో సాదా నీటితో జుట్టును కడిగి కాలుష్య కణాలను తొలగించుకోవాలి. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంతో చండ్రు సమస్యను నివారిస్తుంది.

డీప్ కండీషనింగ్ మాస్క్‌లను ఉపయోగించండి
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పటికీ కాలుష్యం వల్ల జుట్టు పొడిగా మారవచ్చు. కాబట్టి వారానికి ఒకసారి డీప్ కండీషనింగ్ మాస్క్ ఉపయోగించడం ద్వారా జుట్టు బలాన్ని, మెరుపును పెంచవచ్చు. ఇది జుట్టును రక్షిస్తూ రాలిపోవడాన్ని నివారిస్తుంది.

జుట్టు ఆరోగ్యంపై శ్రద్ధ
వర్షాకాలంలో చుండ్రు, దురద లేదా జుట్టు రాలడం వంటి సమస్యలు తీవ్రమైతే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాలి. వారి సూచన మేరకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా తల సున్నితత్వం సమస్యలను నివారించే చికిత్సలను తీసుకుంటే జుట్టు హెల్తీగా ఉంటుంది.

మైక్రోఫైబర్ టవల్ కు మారండి
సాధారణ టవల్స్.. తడి జట్టును గట్టిగా పట్టి ఉంచి ఊడిపోయేలా చేస్తాయి. ఈ సమస్యను నివారించేందుకు మైక్రో ఫైబర్ టవల్స్ ఉపయోగించాలి. ఇది జుట్టుపై ఒత్తిడిని తగ్గించి.. వేగంగా ఆరబెట్టడానికి సహాయపడుతుంది.

Also Read: Rangareddy Murder Case: రాష్ట్రంలో ఘోరం.. ఫేమస్ కావాలని అక్కను చంపిన తమ్ముడు!

రాత్రిళ్లు నూనె రాయవద్దు
వర్షాకాలం నూనె రాయడం వల్ల తలపై తేమను మరింత పెరుగుతుంది. ఇది తలపై ఫంగస్ పెరుగుదలకు కారణంగా మారవచ్చు. కాబట్టి రాత్రిళ్లు నూనె పెట్టుకొని.. పగలు తల స్నానం చేసే పద్దతికి చెక్ పెట్టాలి. నూనె పెట్టుకున్న తర్వాత గంటలోపు తల స్నానం చేస్తే మంచిది.

Also Read: Delhi Woman: పిల్లలు ఉన్నారని.. జాబ్ నిరాకరణ.. యువతికి షాకింగ్ అనుభవం!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం