Rangareddy Murder Case: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఫేమస్ అయ్యేందుకు యూత్ ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్న వీడియోలు వైరల్ కావడాన్ని రోజూ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలో ఓ యువకుడు మరో అడుగు ముందుకేశాడు. ఫేమస్ అయ్యేందుకు సొంత అక్కనే దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. షాద్ నగర్ లో జరిగిన పరువు హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వెలుగులోకి సంచలన రీల్!
హైదరాబాద్ షాద్ నగర్ కు సమీపంలోని పెంజర్ల గ్రామానికి చెందిన రుచిత (21)ను సోమవారం ఆమె తమ్ముడు రోహిత్ (18) హత్య చేశాడు. స్వగ్రామానికి చెందిన మరో యువకుడితో అక్క ఫోన్ లో మాట్లాడుతోందని తెలిసి.. గొంతుకు ఛార్జింగ్ వైర్ బిగించి హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి రోహిత్ ను పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు రిమాండ్ సైతం విధించింది. ఈ క్రమంలోనే తాజాగా కీలక విషయాలు వెలుగు చూశాయి. సోదరి హత్యకు ముందు ఇన్ స్టాగ్రామ్ వేదికగా రోహిత్ చేసిన రీల్.. చర్చనీయాంశంగా మారింది.
చంపి ఫేసమ్ అయ్యేదా?
అక్క రుచిత హత్యకు ముందు రోహిత్ ఓ రీల్ చేశాడు. ‘ఫేమస్ అవ్వాలి మామ. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు. బాగా చంపి ఫేమస్ అయ్యేదా?’ అంటూ ఓ సినిమా డైలాగ్ చెబుతూ అందులో కనిపించాడు. దీంతో హత్య చేసేందుకు ముందుగానే రోహిత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హత్య తర్వాత ఏమి ఎరుగనట్లు బంధువులకు ఫోన్ చేసిన రోహిత్.. సోదరి స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పాడు. విషయం తెలుసుకొని తండ్రి నిలదీయడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు సైతం నిర్ధారించారు.
బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు..బాగా చంపి ఫేమస్ అయ్యేదా
వేరే యువకుడితో ఫోన్ మాట్లాడుతుందని అక్కని చంపిన తమ్ముడి కేసులో బయటపడ్డ కీలక విషయాలు
అక్కను చంపే ముందు ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసిన తమ్ముడు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో తన అక్క రుచిత(21),… https://t.co/qX8lHqvTzv pic.twitter.com/J4hfjl9vJJ
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2025
Also Read: Noida Crime: వీధి కుక్క విషయంలో గొడవ.. జర్నలిస్టుకు 8 కత్తిపోట్లు.. మ్యాటర్ ఏంటంటే?
పరువు పోతోందని..
మృతురాలు రుచిత.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడితో రహస్యంగా ఫోన్లు మాట్లడటం చేసేది. వీరి ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇంట్లో తరుచూ గొడవలు జరిగేవి. ఆ ఊళ్లో సైతం పలుమార్లు పంచాయతీలు పెట్టినట్లు తెలుస్తోంది. తరుచూ గొడవలు, పంచాయతీలు జరిగినా కూడా అక్క రుచిత.. ప్రియుడితో ఫోన్ లో మాట్లాడుతుండటం రోహిత్ కు అస్సలు నచ్చలేదు. ఫ్రెండ్స్ అందరి ముందు తన పరువు పోతోందని మదన పడేవాడు. లవర్ తో మాట్లాడొద్దని అక్కను రోహిత్ చాలా సార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె మాట వినకపోవడంతో చివరకూ ఆమెను హత్య చేసినట్లు స్పష్టమవుతోంది.