Noida Crime (image Source: AI)
Viral, లేటెస్ట్ న్యూస్

Noida Crime: వీధి కుక్క విషయంలో గొడవ.. జర్నలిస్టుకు 8 కత్తిపోట్లు.. మ్యాటర్ ఏంటంటే?

Noida Crime: ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటుచేసుకుంది. వీధి కుక్కకు ఆహారం పెడుతుండగా అభ్యంతరం చెప్పినందుకు ఓ జర్నలిస్టుపై దారుణంగా కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు దాడికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.

అసలేం జరిగిందంటే?
యూపీలోని నోయిడాకు చెందిన ప్రమోద్ శర్మ (Pramod Sharma) ఓ హిందీ దినపత్రికలో ఫొటో జర్నలిస్టు (Photo journalist)గా పనిచేస్తున్నారు. కుటుంబంతో కలిసి సెక్టార్ 74లోని సర్ఫాబాద్ ప్రాంతంలో జీవిస్తున్నారు. రోడ్డుకు అడ్డుగా నిలబడి వీధి కుక్కకు ఆహారం పెడుతున్న క్రమంలో అభ్యంతరం చెప్పినందుకు శర్మపై ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తితో 8సార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు శర్మ మీడియాకు తెలిపారు. ‘నేను ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా స్పీడ్ బ్రేకర్ రావడంతో కారును కొంచెం స్లో చేశాను. ఒక వ్యక్తి కారు వద్దకు వచ్చి సగం తెరిచిన కిటికీ గుండా పదునైన ఆయుధంతో నా కుడి భుజంపై 8 సార్లు పొడిచాడు’ అని శర్మ చెప్పారు. కిటికీ పూర్తిగా తెరిచి ఉంటే గాయాలు మరింత తీవ్రమయ్యేవని పేర్కొన్నారు.

పోలీసులపైకి నిందితుడు కాల్పులు
అయితే దాడిచేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రమోద్ శర్మ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. రక్తస్రావం ఎక్కువకావడంతో అతడు స్పృహ కోల్పోయాడని సమాచారం. తోటి జర్నలిస్టులు.. పోలీసులను అప్రమత్తం చేసి.. సెక్టార్ 39లోని ప్రభుత్వ ఆస్పత్రికి శర్మను తరలించారు. సీనియర్ అధికారులు ఆస్పత్రిని సందర్శించి అనుమాతుడ్ని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం (జులై 29) పోలీసు పెట్రోలింగ్ సిబ్బంది.. అనుమానుతుడ్ని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో నిందితుడు దీపక్ శర్మ (25) పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు యత్నించాడు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు.. చివరికి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

దాడికి ముందు జరిగింది ఇదే
జర్నలిస్టుపై చేసిన దాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విచారణ సమయంలో దీపక్ శర్మ వివరించినట్లు సెక్టార్ 113 స్టేషన్ హౌస్ ఆఫీసర్ కృష్ణ గోపాల్ శర్మ తెలిపారు. ‘దీపక్ సోదరుడు వారి ఇంటికి సమీపంలో ఓ వీధి కుక్కకు బిస్కెట్లు తినిపిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన జర్నలిస్టు ప్రమోద్ శర్మ అభ్యంతరం తెలిపాడు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతున్నట్లు చెప్పాడు. సమీపంలో ఇదంతా గమనిస్తూ ఉన్న దీపక్ శర్మ.. కారులో ఉన్న ప్రమోద్ పై కత్తితో దాడి చేశాడు’ అని పోలీసు అధికారి తెలిపారు. అయితే కుక్కను పక్కకు తీసుకెళ్లాలని మాత్రమే ప్రమోద్ శర్మ అన్నాడని పోలీసు అధికారి చెప్పారు.

Also Read: Tsunami Alert: రష్యాలో సునామీ ఎఫెక్ట్.. అమెరికాలోని భారతీయులకు హెచ్చరికలు జారీ!

నిందితుడికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్!
నిందితుడు దీపక్ శర్మపై ఇప్పటికే పలు నేరాల కింద కేసులు ఉన్నాయని పోలీసు అధికారి కృష్ణ గోపాల్ శర్మ అన్నారు. దొంగతనం, అక్రమ ఆయుధాలు, గ్యాంగ్ స్టర్ చట్టాల కింద అతడిపై 11 పైగా కేసులు ఉన్నట్లు వివరించారు. నిందితుడు ఉపయోగించిన రివాల్వర్, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతడిపై హత్యాయత్నం, గాయపరచడం వంటి నేరాల కింద కేసు నమోదు చేసినట్లు సెక్టార్ 113 స్టేషన్ హౌస్ ఆఫీసర్ వివరించారు.

Also Read This: Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం