Gurukul Seats( image CREDIT: twiter)
నార్త్ తెలంగాణ

Gurukul Seats: ర్యాంకులు లేకున్నా రికమెండేషన్‌లు.. ఎంపీల పేర్లతో అత్యధిక పైరవీలు

Gurukul Seats: గురుకుల సీట్ల భర్తీలో అధికారులకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు,(MLA) ఎంపీలు,(Mp) ఇతర ప్రజాప్రతినిధులు విద్యార్థులకు సరైన ర్యాంకులు లేకున్నా.. రిఫర్ చేస్తున్నట్లు అధికారులు ఆఫ్​ ది రికార్డులో చెబుతున్నారు. దీంతో పాటు పరిమితి కంటే ఎక్కువ లెటర్లు ఇచ్చి, తమపై ప్రెజర్ తెస్తున్నట్లు ఆఫీసర్లు వాపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ.. అన్ని గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు గురుకుల సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు.

అన్ని గురుకులాల్లో కలిసి దాదాపు పది వేల లెటర్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. లెటర్లు ఇవ్వడంతో పాటు సీట్లు ఇవ్వాల్సిందేనంటూ తమపై ఒత్తిడి వస్తున్నట్లు వివరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి ఒక్కో ప్రజాప్రతినిధి సిఫారసుకు కొన్ని సీట్లను సంస్థలు ఇస్తున్నాయి. ఆ సంఖ్య కంటే నాలుగు ఐదు రెట్లు లెటర్లు పంపుతూ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ అధికారి వివరించారు. దీని వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉన్నదని ఆ అధికారి తెలిపారు.

 Also Read: BRS KCR: సర్కార్ దుర్మార్గపు వైఖరిని ఎండగట్టాలి.. పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం!

లీగల్ సమస్యలు?
మెరిట్ ర్యాంకుల ప్రకారం సీట్ల భర్తీ జరిగిందంటూ అధికారులు చెబుతున్నా, ప్రజాప్రతినిధులు ఇచ్చే లెటర్లకూ సీట్లు కేటాయించాల్సి వస్తున్నట్లు ఆఫ్​ ది రికార్డులో వివరిస్తున్నారు. ఇవన్నీ అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నాయి. దీని వలన కొందరు ఆర్టీఐల రూపంలో సమాచారం సేకరించి కోర్టు మెట్లు కూడా ఎక్కుతున్నట్లు తెలిసింది. ఇలాంటి అంశాలపై గతంలో హైకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. అధికారులకు నోటీసులు వచ్చినట్లు తెలిసింది. ఇవి అధికారులకు ఆటంకం కలుగుతున్నది.

ఇదే విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఓ ఎంపీ తన సెగ్మెంట్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్ధులకు సీట్లు కేటాయించాలని లెటర్లు ఇచ్చారట. ఆ విద్యార్థులకు సరైన ర్యాంకులు లేని కారణంతో అధికారులు ఆ సీట్ల భర్తీని తిరస్కరించారు. కానీ, ఆ ఎంపీ అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

సీట్లు పెంపుతో
అన్నింటి కంటే ఎస్సీ గురుకులాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం సీట్ల కోసం తమ పై ప్రెజర్ పెట్టే కంటే, ప్రభుత్వం నుంచి సీట్ల పెంపునకు అప్రూవల్ చేపిస్తే అందరికీ న్యాయం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమపై ఒత్తిడి పెట్టేకంటే, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా సీట్లు పెంచేందుకు ప్రయత్నించాలని సెక్రటేరియట్‌లోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. గురుకులాల్లో అత్యధిక ర్యాంకులు వస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితి ఉన్నదని ఆయన వివరించారు.

ఇక సీట్లు ఇప్పిస్తామంటూ దళారీ వ్యవస్థ కూడా పెరిగిపోయింది. ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క(Seethakka) కోఆర్డినేటర్ అంటూ ప్రశాంత్ అనే వ్యక్తి గురుకులాల్లో సీట్లు ఇప్పిస్తానని కొందరిని మోసం చేసినట్లు కేసు నమోదు అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సీతక్క కార్యాలయం అధికారులు, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ఇలా చాలా మంది ప్రజాప్రతినిధుల పేర్లు వాడుతూ, ఫేక్ లెటర్లు తయారు చేస్తే సీట్ల కోసం తమకు సిఫారసులు వస్తున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఈ తప్పిదాలకూ చెక్ పెట్టాల్సిన​ అవసరం ఉన్నదంటూ అధికారులు చెబుతున్నారు.

 Also Read: Suleiman Shah: పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఖేల్‌ఖతం.. ప్రతీకారం తీర్చుకున్న బలగాలు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?