japan rocket crash
అంతర్జాతీయం

Japan Rocket : గాల్లో పేలిన జపాన్ ప్రైవేట్ రాకెట్

A Japanese Private Rocket That Exploded Moments After It Took Off : టోక్యోకు చెందిన స్పేస్‌ వన్‌ సంస్థ నిర్మించిన కైరోస్‌ రాకెట్‌ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి ఎగిరింది. వాణిజ్య పరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ దేశం ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నిరయ్యాయి. ఆదిలోనే వారి ప్రయత్నానికి అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించిన వీడియోలు  ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

బుధవారం ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి బయల్దేరిన తొలి ప్రైవేట్ రాకెట్ ఇది. కైరోస్ లాంచ్ అయిన కొద్ది సెకండ్లలోనే భారీగా నిప్పులు కక్కుతూ మధ్యలోనే పెద్ద మంటలతో పేలిపోయింది. ఈ రాకెట్ నింగిలోకి ఎగిరితే జపాన్ చరిత్రలో తొలి ప్రైవేట్ రాకెట్‌ నింగిలోకి పోయిన రాకెట్‌గా రికార్డులు క్రియేట్ చేసేది. కానీ మధ్యలోనే పేలిపోవడంతో వారి ఆశలన్నీ నిరాశలు అయ్యాయి.

Read More: టిక్‌టాక్ పాలిటిక్స్, యాప్ బ్యాన్‌పై ట్రంప్ అభ్యంతరం

ఈ రాకెట్‌ని స్పేస్ వన్ అనే స్టార్టప్ కంపెనీ అనే సంస్థ తయారు చేసింది. 59 అడుగుల పొడవైన ఈ కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్ రాకెట్ ప్రభుత్వానికి చెందిన సాటిలైట్‌ని నింగిలోకి మోసకెళ్లాల్సి ఉంటుంది. రాకెట్ పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రాకెట్ శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి. ఈ రాకెట్ మార్చి 9న లాంచ్ కావాల్సి ఉంది. కానీ.. పలు సాంకేతిక కారణాల మూలంగా లాంచింగ్ అంతరాయం ఏర్పడింది.

రాకెట్ పేలిపోవడంతో స్పేస్ వన్‌ కంపెనీ షేర్లు జపాన్ స్టాక్‌ మార్కెట్‌లో ఒక్కరోజే 13 శాతం అమాంతం డౌన్‌కి పడిపోయాయి. ఈ పేలుడుతో లాంచ్‌ ప్యాడ్‌ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగను కమ్మేసింది. ఈ ప్రయోగం విజయవంతమై ఉంటే.. ఆ దేశంలో శాటిలైట్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేట్‌ సంస్థగా స్పేస్‌ వన్ అవతరించేది. గాల్లో రాకెట్‌ పేలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!