US News: అగ్రరాజ్యం అమెరికాలో (US News) భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. మైనర్లను లైంగిక వేధింపులకు గురిచేశాడనే అభియోగాలపై ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగరంలో జయదీప్ పటేల్ (31) అనే వ్యక్తిని జులై 17న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పటేల్ గతంలో ఫీనిక్స్ చిల్డ్రెన్స్ హాస్పిటల్‌లో బిహేవియరల్ హెల్త్ టెక్నీషియన్‌గా పనిచేశాడు. ఆ సమయంలో పిల్లల అశ్లీల ఫొటోలు, వీడియోలు తీసినట్టుగా స్థానిక మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. మొత్తం 1,200లకు పైగా ఫొటోలు, వీడియోలు అతడికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాల్లో గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో, మైనర్ పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించిన తొమ్మిది నేరాభియోగాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండవ స్థాయి నేర తీవ్రత కలిగిన సెక్షన్లను చేర్చారు. మొదటిసారి ఈ నేరాలకు పాల్పడినవారికి 3 నుంచి 12.5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాగా, ఈ కేసు 2024లోనే వెలుగుచూసింది. ఒక సోషల్ మీడియా ప్రొఫైల్‌లో పిల్లల లైంగిక దాడులకు సంబంధించిన అంశాలు ఉన్నాయంటూ పోలీసులకు కొందరు సమాచారం అందించారు.
కోర్టు పత్రాల ద్వారా బయటకు..
కేసు తదుపరి దర్యాప్తులో భాగంగా జయదీప్ పటేల్ ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. అతడి సెల్‌ఫోన్ నంబర్‌కు లింక్ అయి ఉన్న పలు సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించి కూడా సర్చ్ వారెంట్ జారీ చేశారు. దర్యాప్తులో జయదీప్ పటేల్ పంపించిన అసభ్యకర మెసేజుల ట్రాన్స్‌క్రిప్టులు లభ్యమయ్యాయి. కొన్ని చాట్‌లలో పటేల్ తన వ్యక్తిగత కోరికల తృప్తి కోసం పిల్లలపై దౌర్జన్యాలకు పాల్పడ్డాడని కోర్టు పత్రాల ద్వారా వెల్లడైంది. మైనర్లకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు, వీడియోలను కూడా పోలీసులు గుర్తించారు. వాటిలోని కొన్ని ఫుటేజీల్లో కనిపించిన ఇల్లు అతడిదేనని, ఫొటోల్లో కనిపించిన శరీరం జయదీప్ పటేల్‌దేనని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక అతడి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి రికవర్ చేసిన 9 వీడియోల్లో మైనర్లు అయిన స్కూల్ విద్యార్థినులు శరీర ప్రదర్శన చేయడం లేదా చెప్పలేని కార్యకలాపాల్లో పాల్గొనడం కనిపించిందని కోర్టు పత్రాల్లో పోలీసులు పేర్కొన్నారు.
Read Also- Perimenopause: 40 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ముఖ్యమైన అలవాట్లు ఇవే!
చిల్డ్రెన్ హాస్పిటల్ ఏమన్నదంటే?
ఈ ఘటనపై ఫీనిక్స్ చిల్డ్రెన్స్ హాస్పిటల్ ఇటీవలే స్పందించింది. పటేల్‌ను ఉద్యోగంలోకి తీసుకున్న సమయంలో అతడికి సంబంధించిన అన్ని ప్రామాణిక బ్యాక్‌గ్రౌండ్ స్పష్టంగా తనిఖీ చేశామని ప్రకటించింది. హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లు, వారి కుటుంబాల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఫీనిక్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రకటనలో వివరించింది. తమ విధానాల ప్రకారం, ఉద్యోగ నియామకానికి ముందు, స్క్రీనింగ్ ప్రక్రియలో కూడా జయదీప్ పటేల్‌కు సంబంధించిన సమగ్ర బ్యాక్‌గ్రౌండ్ తనిఖీ చేశామని తెలిపింది. ప్రస్తుతం తమ వద్ద ఉద్యోగం చేయడంలేదని, పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకారిస్తామని యాజమాన్యం తెలిపింది. జయదీప్ పటేల్ బెయిల్‌కు ఓ జడ్జి ఏకంగా ఒక లక్ష డాలర్ల బాండ్ విధించినట్టు తెలుస్తోంది. ఈ భారీ మొత్తం చెల్లించి బయటకు వెళ్లినా అతడిపై ఎలక్ట్రానిక్ మానిటరింగ్, పరిమితులు, చిన్నపిల్లలతో ఎలాంటి కాంటాక్ట్ ఉండకుండా కఠిన నిబంధనలు అమలవుతాయని సమాచారం.
Read Also- Suleiman Shah: పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఖేల్‌ఖతం.. ప్రతీకారం తీర్చుకున్న బలగాలు