Cancer: ధూమపానం చేయని వారిలో కూడా తల, మెడ క్యాన్సర్‌?
cancer (Image Source: Twitter)
Viral News

Cancer: షాకింగ్.. ధూమపానం చేయని వారిలో కూడా తల, మెడ క్యాన్సర్‌?

Cancer: సాధారణంగా ధూమపానం చేయడం వలనే క్యాన్సర్ వస్తుందని విన్నాము. అయితే, తాజాగా నిపుణులు నమ్మలేని నిజాలు బయట పెట్టారు. ఒక ఆంకాలజిస్ట్ చెప్పిన విషయాలు చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. అయితే, అసలు ఆయన ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Vijay Deverakonda: కొండన్న ఈ మూవీ కూడా పోతే.. ఇంక నువ్వు అండర్ గ్రౌండ్ కే.. విజయ్ ని ఘోరంగా అవమానిస్తున్న ట్రోలర్స్

ధూమపానం చేసిన వారిలో తల, మెడ క్యాన్సర్‌ వస్తుందని తెలుసు. అయితే,  చేయని వారిలో కూడా ఈ సమస్యలు వస్తాయని వెల్లడించారు. ‘ఇది ఇకపై పొగాకు తాగే వాళ్ళకే కాకుండా ‘ తాగని వారికీ కూడా వస్తోందని అంటున్నారు. ఇది ఇప్పటి వరకు పొగాకు వాడకంతో ముడిపడి ఉందని, కానీ ఇటీవలి అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాల ప్రకారం, ధూమపానం చేయని వారిలో కూడా ఈ క్యాన్సర్‌కు ఇతర కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ క్యాన్సర్‌ రావడానికి కారణాలు ఇవే..

హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV): HPV సంక్రమణ, ముఖ్యంగా HPV-16 వైరస్, నోటి, గొంతు క్యాన్సర్‌లకు ప్రధాన కారణంగా గుర్తించబడింది. ఈ వైరస్ లైంగిక సంపర్కం ద్వారా సంక్రమిస్తుంది. ఇది ధూమపానం చేయని యువ వయస్సు వారిలో కూడా క్యాన్సర్‌ను కలిగిస్తోంది.

Also Read: Rakul Preet Singh: పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారంటూ.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చి పడేసిన రకుల్ ప్రీత్ సింగ్

పర్యావరణ కారకాలు: కొన్ని రసాయనాలు, కాలుష్యం, రసాయనాలకు గురికావడం కూడా తల, మెడ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

మద్యం సేవించడం: అతిగా మద్యం సేవించడం, ధూమపానం లేకపోయినా, నోటి, గొంతు, లారింక్స్ క్యాన్సర్‌లకు కారణం కావచ్చు.

దీర్ఘకాలిక గాయాలు, ఇన్ఫెక్షన్లు: నోటిలో దీర్ఘకాలిక గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా దంత సమస్యలు లేదా దీర్ఘకాల గొంతు ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచవచ్చు.

జన్యు సంబంధిత కారకాలు: కొన్ని జన్యు మార్పులు వలన కూడా ఈ క్యాన్సర్‌ వస్తుందని అంటున్నారు.

Also Read: Child Offering Ritual: వామ్మో ఇదేం పద్ధతి.. ఆ జిల్లాలో పిల్లలను వేలం పాటలో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు?

ఈ సమస్యకు నివారణ చర్యలు ఇవే..

1. HPV టీకా వేయించుకోవాలి.
2. మద్యం సేవించడం తగ్గించుకోవాలి. లేదా పూర్తిగా మానేయ్యాలి.
3. క్రమం తప్పకుండా దంత పరీక్షలు, వైద్య పరీక్షలు చేయించుకోవడం.
4. కాలుష్యం, రసాయనాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Just In

01

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క

Bigg Boss Buzzz: నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది.. భరణి సంచలన వ్యాఖ్యలు