Stampede At Haridwar
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Haridwar Stampede: మానస దేవి ఆలయంలో ఘోర విషాదం.. ఏడుగురి మృతి

Haridwar Stampede: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ పవిత్ర క్షేత్రంలో ఉన్న మానస దేవి ఆలయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఆలయం మెట్లపై భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల సంఖ్యలో భక్తులు మంది గాయపడ్డారు. ప్రధాన ఆలయానికి వెళ్లే మార్గంలోని మెట్లపై ఈ విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందంటూ వదంతులు వ్యాపించడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వదంతుల కారణంగా భక్తుల్లో ఒక్కసారిగా ఆందోళన పెరిగి తొక్కిసలాటకు దారితీసిందని అభిప్రాయపడ్డారు.

తొక్కిసలాటకు ముందు మానస దేవి ఆలయంలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉందని హరిద్వార్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు. హరిద్వార్ జిల్లా పోలీసు ఉన్నతాధికారి ప్రమెంద్ర సింగ్ దోబాల్ ఆరుగురు మృతి చెందినట్టు తొలుత ప్రకటించారు. ఆ తర్వాత మరొకరు మృతి చెందినట్టు నిర్ధారించారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకొని రెస్క్యూ చర్యలు మొదలుపెట్టామని అన్నారు. దాదాపు 35 మంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. విద్యుత్ షాక్ కొడుతోందంటూ దుష్ప్రచారం జరగడంతో తొక్కిసలాటకు కారణంగా తెలుస్తోందని ప్రమెంద్ర సింగ్ వివరించారు.

Read Also- Nitish Reddy: ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ నితీశ్ రెడ్డి షాకింగ్ నిర్ణయం?

ఈ దుర్ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. గాయపడ్డ భక్తులను అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించడం వీడియోల్లో కనిపించింది. 55 మంది వరకు భక్తులు గాయపడినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, హిందువులకు పవిత్రమైన శ్రావణ మాసంలో హరిద్వార్‌తో పాటు నగరంలోని అన్ని తీర్థ క్షేత్రాల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుంది. శివభక్తులు, కాన్వర్యాలు (Kanwariyas) గంగా జలాన్ని సేకరించి హరిద్వార్‌కు తరలివెళ్లారు. ఈ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బీహార్‌కు చెందిన ఓ భక్తుడు మాట్లాడుతూ, ఒక్కసారిగా భారీ సమూహం ఆలయం వద్దకు చేరిందని, దీంతో, తొక్కిసలాట జరిగిందని తెలిపాడు. భయాందోళనలకు గురైన భక్తులు ఆ సమూహం నుంచి బయటపడేందుకు ఒకరిని మరొకరు తోసుకుంటూ కింద పడిపోయారని చెప్పాడు. తనకు చేతి ఎముక విరిగిందని ఆ భుక్తుడు కన్నీటి పర్యంతమయ్యాడు.

కారణం ఇదేనా?
మానస దేవి ఆలయంలో ఉదయం 9 గంటల సమయంలో తొక్కిసలాట జరిగిందని హరిద్వార్ జిల్లా కలెక్టర్ మయూర్ దిక్షిత్ మీడియాకు వెల్లడించారు. ఈ దుర్ఘటనకు అసలు కారణం ఏంటనేది అధికారిక విచారణలో వెల్లడికానుంది. అయితే, ఒక విద్యుత్ తీగ తెగిపోయి, దాని గుండా కరెంట్ పాస్ అవుతోందంటూ వదంతలు వ్యాపించాయని ప్రాథమిక సమాచారం. భక్తుల్లో భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటపడేందుకు ఒకరినొకరు నెట్టుకున్నట్టు తెలుస్తోంది. మార్గంలో కరెంట్ తీగ షాక్ కొడుతోందంటూ ఓ వ్యక్తి బిగ్గరగా అరవడం ఈ తొక్కిసలాటకు కారణమైందని ఓ భక్తుడు చెప్పాడు. అతడి మాట దావానంలా వ్యాపించిందని, కొండ పైభాగంలో ఒక్కసారిగా కల్లోలం నెలకొని, తీవ్ర తొక్కిసలాట చోటుచేసున్నట్టు ప్రాథమిక సమాచారం అని అధికారులు పేర్కొన్నారు.

Read Also – Nitish Reddy: చిక్కుల్లో క్రికెటర్ నితీష్ రెడ్డి.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు

రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ దుర్ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమని ఘటన అని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. హరిద్వార్ తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలంటూ అభిలాషించారు. ‘‘ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్న మానస దేవి ఆలయ మార్గంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం జరగడం తీవ్ర విచారకరం. ప్రియమైన ఆప్తులను, కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలి. స్థానిక పాలనా యంత్రాంగం బాధితులకు సాయం అందిస్తోంది’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ఈ దుర్ఘటనపై ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఎస్‌డీఆర్ఎఫ్‌తో పాటు స్థానిక పోలీసు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని తెలిపారు.

మానస దేవి ఆలయ మార్గంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వార్త తనను ఎంతగానో కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో నిరంతరం సంప్రదింపుల్లో జరుపుతున్నానని, పరిస్థితిని దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 పరిహారం అందిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదనపు సమాచారం కోసం (+91) 94111 12973, 95206 25934 నంబర్లు సంప్రదించాలని పోలీసులు సూచించారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!