GHMC: ఏ ఎలక్షన్ వచ్చినా ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒక్కోక్కరు ఒక్కో చోట ఓటు వేసేందుకు వెళ్లాల్సిన పరిస్థితికి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ(GHMC) సిద్దమైంది. ఓటు ఎక్కడ వేయాలి? పోలింగ్ బూత్ ఎంత దూరంలో ఉంది? క్యూలైన్ ఉందా? ఉంటే ఎంతమంది క్యూలో ఉన్నారు? అన్న రకరకాల సందేహాలతో ఓటరు అయోమయానికి గురి కాకుండా ఒక కుటుంబంలోని ఓటర్లంతా ఒకే చోట ఓటు వేసేందుకు వీలుగా జీహెచ్ఎంసీ ‘నజరీ నక్ష’ సిద్దం చేయనుంది.
Also Read: AP Liquor Scam: తెలంగాణకు ఏపీ లిక్కర్ స్కాం సెగ.. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం!
ఒకే కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు చోట ఉన్న పోలింగ్ స్టేషన్లలో ఓటు వేయాల్సిన పరిస్థితుల కారణంగానే చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించటం లేదన్న విషయాన్ని సైతం జీహెచ్ఎంసీసీ(GHMC) గుర్తించి, ప్రతి ఒక్కరూ తమ ఓటును వేసేలా నజరీ నక్షను సిద్దం చేస్తుంది. ఇందుకు ఇప్పటికే నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 3984 పోలింగ్ స్టేషన్లకు బూత్ లెవెల్ ఆఫీసర్లను కూడా నియమించిన జీహెచ్ఎంసీ ఇంటి నెంబర్ ఆధారంగా ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను గుర్తించి, వారెక్కడెక్కడ ఓట్లు వేస్తున్నారన్న విషయాన్ని గుర్తించేందుకు ఇప్పటికే వారికి పలు దఫాలుగా శిక్షణ కూడా ఇచ్చింది.
నజరీ నక్ష అంటే?
నజరీ నక్ష అంటే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఒక ఏరియాను ఎంపిక చేసుకుని, ఆ ప్రాంతంలో ఇంటి నెంబర్ల ఆధారంగా ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఎంపిక చేసుకుని, వారు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఓటు వేస్తున్నారు? వారికి చేరువగా మరేదైనా పోలింగ్ స్టేషన్ ఉందా? ఉంటే అందులో ఎంత మంది ఓటర్లున్నారు? ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఆ పోలింగ్ బూత్‌లో అకామిడెట్ చేయవచ్చా? లేదా? అన్న విషయాన్ని ఫీల్డు లెవెల్‌లో పరిశీలిస్తున్నారు.
ఆ ఏరియాలోనే ఓటర్లున్న ఇంటికి సమీపంలోని పోలింగ్ స్టేషన్‌లోకి వారు ఓట్లను మార్చటంతో పాటు ఎంపిక చేసుకున్న ఏరియాలో సమీపంలో పోలింగ్ స్టేషన్ లేకపోయినట్లయితే, పక్క ఏరియాలో కుటుంబ సభ్యులంతా ఒకే చోట ఓట్లు వేసేలా పోలింగ్ స్టేషన్‌ను ఖరారు చేయటం బూత్ లెవెల్ ఆఫీసర్లు ముఖ్యమైన పని. ఒక కుటుంబంలోని సభ్యులు తమకు సమీపంలోనున్న పోలింగ్ స్టేషన్లనే ఓటు వేసే అవకాశం కల్పిస్తే, అందరు కలిసి ఒకే సారి వచ్చి ఓట్లు వేసే అవకాశముంటుందని, తద్వారా పోలింగ్ శాతం కూడా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ఎన్నికల విభాగం సిబ్బంది అభిప్రాయపడుతుంది.
నియోజకవర్గాల వారీగా బూత్ లెవెల్ ఆఫీసర్ల నియామకం
————————————————————————————————————————
నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ల సంఖ్య బీఎల్ఓల సంఖ్య
———————————————————————————————————————-
❄️ముషీరాబాద్ 274 274
❄️మలక్ పేట 300 300
❄️అంబర్ పేట 236 236
❄️ఖైరతాబాద్ 245 245
❄️జూబ్లీహిల్స్ 329 329
❄️సనత్ నగర్ 229 229
❄️నాంపల్లి 276 276
❄️కార్వాన్ 311 311
❄️గోషామహాల్ 235 235
❄️చార్మినార్ 198 198
❄️చాంద్రాయణగుట్ట 305 305
❄️యాకుత్ పురా 332 332
❄️బహద్దూర్ పురా 263 263
❄️సికిందరాబాద్ 220 220
❄️కంటోన్మెంట్ 232 232
——————————————————————————————————————-
మొత్తం 3984 3984
——————————————————————————————————————-
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..
