Nitish Reddy: చిక్కుల్లో నితీష్ కుమార్ రెడ్డి.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
Nitish Kumar Reddy
Viral News, లేటెస్ట్ న్యూస్

Nitish Reddy: చిక్కుల్లో క్రికెటర్ నితీష్ రెడ్డి.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు

Nitish Reddy: తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. రూ.5 కోట్లకు పైగా బకాయిలను డిమాండ్ చేస్తూ గతంలో అతడి వ్యవహారాలు చక్కబెట్టిన ప్లేయర్ మేనేజ్‌మెంట్ సంస్థ ‘స్క్వేర్ ద వన్ ప్రైవేట్ లిమిటెడ్’ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో నితీశ్ రెడ్డి తమతో అర్ధాంతరంగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడని, ఆ తర్వాత, అదే టూర్‌లో ఉన్న టీమిండియాకు చెందిన మరో ఆటగాడి మేనేజర్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడని పేర్కొంది. ‘ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్’ సెక్షన్ 11(6) ప్రకారం నితీష్ కుమార్ రెడ్డిపై పిటిషన్ దాఖలు చేసినట్టు పేర్కొంది. మేనేజ్‌మెంట్ ఒప్పందం ఉల్లంఘన, బకాయిలు చెల్లించకపోవడాన్ని ప్రధాన కారణాలుగా కంపెనీ తెలిపింది. పిటిషన్‌పై విచారణ జరిపేందుకు స్వతంత్ర మధ్యవర్తిని (ఆర్బిట్రేటర్) నియమించాలంటూ పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌ జులై 28న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.

Read Also- Viral News: అంబులెన్స్‌లో యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎంతమందంటే?

2021లో నితీశ్ రెడ్డికి, మేనేజ్‌మెంట్ సంస్థ ‘స్క్వేర్ ద వన్’ మధ్య ఒప్పందం కుదిరింది. ఐపీఎల్‌లో ఎదిగేంతవరకూ అతడికి బ్రాండ్ ప్రమోషన్లు, కమర్షియల్ డీల్స్ తెచ్చిపెట్టామని సంస్థ చెబుతోంది. నాలుగేళ్లలో సంస్థ అతడికి అనేక అవకాశాలు కల్పించిందని సంస్థకు సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వ్యవహారాల్లో 90 శాతం కోర్టుకు వెళ్లకుండానే పరిష్కారం అవుతుంటాయని, కానీ ఈ కేసులో నితీశ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని కంపెనీ వర్గాలు అంటున్నాయి. తానే స్వయంగా బ్రాండ్ డీల్స్‌ చేసుకున్నానంటూ వాదించాడని ‘స్క్వేర్ ద వన్’ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Read Also- Sangareddy Tragic: సంగారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన.. పసికందు మృతి

నితీష్ కుమార్ రెడ్డి భారత్ జట్టులో ఆల్‌రౌండర్‌గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా టెస్ట్ ఫార్మాట్‌లో అరంగేట్రం చేశారు. కానీ, ఆ తర్వాత నితీశ్ రెడ్డి కెరీర్ అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రదర్శన ఆకట్టుకోలేదు. ఇక, తాజాగా ఇంగ్లండ్ టూర్‌కు సెలెక్ట్ అయిన నితీష్ కుమార్ రెడ్డి బర్మింగ్‌హామ్, లార్డ్స్ టెస్టులు ఆడాడు. కానీ, దురదృష్టవశాత్తూ తీవ్రమైన మోకాలి గాయానికి గురయ్యాడు. దీంతో, పూర్తిగా సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయంతో పడుతున్నారు. ఇంగ్లండ్ నుంచి స్వదేశం వచ్చేశాడు.

Read Also- Liver Care: లివర్ ఆరోగ్యాన్ని కాపాడే తేలికైన సలహాలు ఇవే!

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం