Bhadradri kothagudem: సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన నేరాలను అరికట్టే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(SP Rohit Raju) ఐపిఎస్ అన్నారు. జిల్లా పరిధిలోని పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలనీలు మరియు ఇండ్ల పరిసరాలలో సీసీ కెమెరాల(CC Camera) ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్(IPS) ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా బ్యాంకులు(Bank), ATM ల వద్ద సీసి కెమెరాలతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాలనీలు, కమ్యూనిటీలలోకి ప్రవేశించే డెలివరీ బాయ్స్ యొక్క వివరాలను నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే వారిని అనుమతించాలని తెలిపారు.
దొంగతనాల నివారణకు
ఇంటి యజమానులు తమ ఇండ్లలో అద్దెకు నివసించే వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించుకొని తమ వద్ద పెట్టుకోవాలని తెలిపారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇండ్లలో విలువైన వస్తువులను ఉంచకూడదని, అదే విధంగా ఇరుగు పొరుగు వారికి, స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. తమ తమ నివాస ప్రదేశాల్లో అర్ధరాత్రి వేళల్లో ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని కోరారు. తెల్లవారుజామున ఇండ్ల ముందు వాకిలి శుభ్రం చేసేటప్పుడు, రోడ్లపై వాకింగ్ చేసే సమయాల్లో బంగారు(Gold) ఆభరణాలను ధరించరాదని సూచించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసుల(Police)తో సమానమని, సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. దొంగతనాల నివారణకు, రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు పోలీసు వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
Also Read: Drugs Seized: లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్ చేసిన పోలీసులు
చాలా కేసులలో సీసీ కెమెరాలు
జిల్లాలోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. పరిశ్రమల యాజమాన్యాలు, వ్యాపారస్తులు మరియు అన్ని వర్గాల ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో నమోదైన చాలా కేసులలో సీసీ కెమెరాల(CC Camera) ద్వారా నిందితులను పట్టుకోవడం జరిగిందని అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలు మరియు కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. నేరాలను ఛేదించడంతోపాటు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని అన్నారు. కావున జిల్లా ప్రజలందరూ పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తూ తాము నివసించే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Also Read: OTT Platforms: 25 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం.. కేంద్రం షాకింగ్ నిర్ణయం