Piplodi School
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Sad News: ఘోరవిషాదం.. స్కూల్లో ఏడుగురు విద్యార్థుల మృతి

Sad News: అమ్మానాన్నలకు టాటా చెబుతూ.. విద్యా బుద్ధులు నేర్చుకునేందుకు సరదాగా, సంతోషంగా స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇంటికి రాకుండానే తిరిగిరాని (Sad News) లోకాలకు వెళ్లారు. రాజస్థాన్‌లోని ఝాలావార్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పిప్లోడి ప్రైమరీ స్కూల్‌ భవనం పైకప్పు కూలింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు చనిపోయారు. మరో 15 మందికి పైగా గాయపడ్డారు. తరగతులు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక్కసారిగా భవనం పైకప్పు కుప్పకూలింది. పైకప్పు ఊడిపడిన స్కూల్ బిల్డింగ్ నిర్మించి దాదాపు 20 ఏళ్లు దాటడం, అందులోనూ రాతి పలకలతో నిర్మించడంతో తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడిన వెంటనే రెస్క్యూ చర్యలు ప్రారంభమయ్యాయి. పోలీసులు, స్థానికులు, అధికారులు కలిసి శిథిలాల కింద చిక్కుకున్న పిల్లలను బయటకు తీసుచ్చారు.తీసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై ఝాలావార్ ఎస్పీ అమిత్ కుమార్ స్పందించారు. “నలుగురు విద్యార్థులు ఘటనా స్థంలోనే మృతిచెందారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. వారిలో 10 మందిని ఝాలావార్ ఆసుపత్రికి తరలించాం. అందులో ముగ్గురు నుంచి నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది” అని ఆయన వివరించారు.

Read Also- OTT Platforms: 25 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం.. కేంద్రం షాకింగ్ నిర్ణయం

కాగా, ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులు 7వ తరగతి చదవుతున్నారని, వారి వయస్సు 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటాయని ఉపాధ్యాయులు చెప్పారు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. “ఝాలావార్‌లోని స్కూల్‌లో జరిగిన ఘోర ప్రమాదం హృదయవిదారకమైనది. బాధిత విద్యార్థులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన విద్యార్థులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు అవసరమైన అన్ని సహాయాలను అందిస్తున్నాం” అని మోదీ వివరించారు.

Read Also- CM Revanth Reddy: కులగణన రోల్ మోడలే కాదు..రేర్ మోడల్ దీని అర్థం త్వరలోనే చెబుతా!

రాజస్థాన్ సీఎం భజనలాల్ శర్మ కూడా ఈ స్పందించారు. ఇది తీవ్ర విషాదకరమైన ఘటన అని అభివర్ణించారు. గాయపడిన పిల్లలకు మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. మరణించిన పిల్లల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం భజనలాల్ శర్మ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టనున్నట్టు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.

Read Also- Siddipet District: నోటిఫికేషన్ రాక ముందే సర్పంచ్ ఉప సర్పంచ్ ఏకగ్రీవం తీర్మానం చేసుకున్న ఆ గ్రామస్తులు

Just In

01

Pawan Kalyan: అసలిప్పటి వరకు ‘ఓజీ’ స్టోరీ ఏంటో నాకు తెలీదు

Mirai Movie Collections: 150 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘మిరాయ్’ .. తేజ సజ్జా సరికొత్త రికార్డ్!

Vilaya Thandavam: ‘విలయ తాండవం’ టైటిల్ పోస్టర్ అదిరింది

Avika Gor: ప్రియుడితో ‘చిన్నారి పెళ్లికూతురు’ ఏడడుగులు.. ఫొటోలు వైరల్

Disqualification Hearing: నలుగురు ఎమ్మెల్యేల సుదీర్ఘ విచారణ.. నెక్స్ట్ ఏంటి?