Siddipet District ( IMAGE credit: swetvcha reporter)
నార్త్ తెలంగాణ

Siddipet District: నోటిఫికేషన్ రాక ముందే సర్పంచ్ ఉప సర్పంచ్ ఏకగ్రీవం తీర్మానం చేసుకున్న ఆ గ్రామస్తులు

Siddipet District: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానేలేదు. రిజర్వేషన్లు ఇంకా ప్రకటించనేలేదు. అయినా ఓ గ్రామస్తులు సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎంపిక చేసి సన్మానం చేయడం సంచలనానికి గురి చేసింది. సిద్దిపేట జిల్లా (Siddipet District) జగదేవ్ పూర్ మండలం పలుగుగడ్డ గ్రామంలో  ఈ సంఘటన జరగగా స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. పలుగుగడ్డ గ్రామంలో సుమారు 370 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామపంచాయతీలో 8 వార్డులు ఉన్నాయి.

 Alos Read: Tragedy: మియాపూర్ లో విషాదం.. భవనం పై నుండి దూకి 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

గతంలో బిజీ వెంకటాపూర్ నుండి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఎప్పుడు ఎలక్షన్లో వచ్చిన తమ గ్రామానికి సర్పంచ్, ఉప సర్పంచ్ వీరే ఉంటారని ఆ గ్రామస్తులు ముందుగానే ఎంపిక చేసి ప్రకటించడం గమనార్హం. గ్రామానికి చెందిన పలువురు పెద్ద మనుషులు సమావేశమై ఎన్నికలు అవసరం లేదని గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే నర్ర కనకయ్యను సర్పంచిగా, నర్ర రాజేష్ కుమార్ ను ఉప సర్పంచ్ గా ఎంపిక చేశామని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వీరే తమ గ్రామానికి సర్పంచ్, ఉప సర్పంచ్ గా ఉంటారని ప్రకటించారు.

ఎన్నికల కోసం ఖర్చు చేసే డబ్బును గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని, ఎన్నికల వల్ల తమలో తమకు గొడవలు, వైశమ్యూలు పెరుగుతాయని ఏకగ్రీవం వల్ల అందరం కలిసి గ్రామ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేసుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. అయితే సదరు గ్రామపంచాయతీలో ముదిరాజ్ (బిసి) కులానికి చెందిన ఒకే వర్గం వారు ఉండడంతో రిజర్వేషన్ ఇబ్బంది కలగకపోవచ్చు అని భావిస్తున్నారు.

 Also Read: Pawan kalians: ‘హరి హర వీరమల్లు’ సక్సెస్ మీట్.. అలా చేయడంలో తప్పులేదు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!