Rishabh Pant
Viral, లేటెస్ట్ న్యూస్

Team India: ఇంగ్లండ్‌తో నాలుగవ టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్.. ఇషాన్ కిషన్‌కు పిలుపు?

Team India: ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 టెస్టుల అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌ గెలుపుపై ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియాకు (Team India) వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఇప్పటికే నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ అందుబాటులో లేకుండానే మాంచెస్టర్ వేదికగా నాలుగవ మ్యాచ్‌ బరిలోకి దిగిన భారత్ జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి రోజు ఆటలో తీవ్రంగా గాయపడిన స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమంటూ వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. పంత్ పాదానికి బంతి తగిలిన చోట ఫ్రాక్చర్ అయినట్టుగా సమాచారం. దీంతో, కీలక బ్యాటర్ అయిన పంత్ ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. చివరిదైన ఐదవ టెస్ట్‌ మ్యాచ్‌కి కూడా అందుబాటులో ఉండబోడని సమాచారం. కాగా, మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయిన రిషత్ పంత్ కాలికి తీవ్ర గాయమైంది. విలవిల్లాడిపోయిన అతడిని వెంటనే గోల్ఫ్ కార్ట్‌లో ఎక్కించుకొని మైదానం నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్యులు అతడిని పరిశీలించారు.

ఇషాన్ కిషన్‌కు పిలుపు
పంత్ గాయంపై బీసీసీఐ వర్గాలు కూడా స్పందించాయి. రానున్న 6 వారాలపాటు పంత్ అందుబాటులో ఉండబోడని, అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకుంటామని, ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఓ జాతీయ మీడియా సంస్థతో అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగవ మ్యాచ్‌లో పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేయనున్నట్టు తెలిపారు. అయితే, జురెల్ బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం ఉండదు. ఎందుకంటే ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఓ ఆటగాడు గాయంతో రిటైర్ అయితే అతడి స్థానంలో మరొకరు బ్యాటింగ్ చేయడానికి వీల్లేదు. దీంతో, టీమిండియా ఒక బ్యాటర్ తక్కువతోనే ఆడనుంది.

Read Also- Plane Crash: కుప్పకూలిన మరో విమానం.. ప్యాసింజర్లు, సిబ్బంది అందరూ మృతి!

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్‌ మ్యాచ్‌ జులై 31- ఆగస్ట్ 4 మధ్య జరగనుంది. లండన్‌లో ఉన్న కెన్నింగ్టన్ ఓవల్‌ మైదానం వేదికగా జరగనుంది. నాలుగవ మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేయనుండడం ఖరారైంది. అయితే, ఐదవ టెస్టుకు బలమైన బ్యాకప్ అవసరమని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇప్పటికే నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ లాంటి ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. దీంతో, జట్టు సమతుల్యత భారీగా దెబ్బతిన్నది.

పంత్ గాయం.. భారత్‌కు ఎదురుదెబ్బ
కాగా, రిషబ్ పంత్‌ పాదం ఫ్రాక్చర్ అయి ఉండొచని ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ అనుమానం వ్యక్తం చేశాడు. “పంత్ కాలు నేలపై పెట్టలేకపోయాడు. వెంటనే వాపు రావడం ఆందోళన కలిగించింది. స్వయంగా నాకే ఒకసారి మెటాటార్సల్ గాయం అయిన అనుభవం ఉంది. అవి చాలా చిన్న, బలహీనమైన ఎముకలు. వాటిపై బరువు పెట్టపోవడం మంచిది” అని స్కై స్పోర్ట్స్‌లో రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ అథర్టన్ కూడా పంత్ గాయంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ గాయంతో పంత్ సిరీస్‌కి దూరమవుతాడేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ‘‘పంత్ ఈ మ్యాచ్ నుంచి, సిరీస్ నుంచి వైదొలగితే టీమిండియాకు అది గట్టి ఎదురు దెబ్బ అవుతుది. మొదటి రోజు 264/4గా ఉన్న స్కోరు మారిపోతోంది. కొత్త బంతితో ఇంగ్లండ్ బౌలర్లు భారత్‌ను కట్టడి చేయగలరు. కానీ, పంత్ గనుక బ్యాటింగ్‌కు వస్తే మ్యాచ్‌ను పూర్తిగా మార్చేయగలడు. దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. నిజం చెప్పాలంటే, ఒక ఆటగాడిని బండిపై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లడమంటే అది సాధారణ గాయం కాదని అర్థమవుతుంది” అని అథర్టన్ వ్యాఖ్యానించాడు.

Read Also- Mumbai Blasts: ముంబై పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు బిగ్ ట్విస్ట్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!