Sub-inspector Stolen 2 cr (Image Source: Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Sub-inspector Stolen 2 cr: బాధితుల సొమ్ముతో లేచిపోయిన పోలీసు జంట.. రూ.2 కోట్లతో గోవా, మనాలీలో షికార్లు.. చివరికి!

Sub-inspector Stolen 2 cr: ఢిల్లీ పోలీసు డిపార్ట్ మెంట్ లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సైబర్ మోసాల కేసులో వసూలైన రూ.2 కోట్ల రూపాయలతో ఇద్దరు సబ్ ఇన్ స్పెక్టర్ల జంట లేచిపోయింది. ఆ డబ్బుతో గోవా, మనాలి, కశ్మీర్ వంటి పర్యాటక ప్రాంతాల్లో విహారయాత్రలు చేసింది. సెలవని చెప్పి వెళ్లిన ఇద్దరు ఎస్సైలు తిరిగి రాకపోవడంతో అనుమానించిన ఢిల్లీ పోలీసులు.. విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. వారు చేసిన ఫ్రాడ్ చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు.

అసలేం జరిగిందంటే?
ఢిల్లీకి చెందిన అంకూర్ మాలిక్ (Ankur Malik), నేహా పూనియా (Neha Punia) 2021 బ్యాచ్ కు చెందిన సబ్ ఇన్ స్పెక్టర్లు. అంకుర్.. ఈశాన్య జిల్లా సైబర్ ఠాణాలో ఎస్సైగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ ఫిర్యాదు దారులను సృష్టించిన అతడు.. కోర్టు నుండి నగదు అందజేతకు పర్మిషన్ తెచ్చుకున్నాడు. తద్వారా పట్టుబడిన సైబర్ సొమ్ము నుంచి రూ.2 కోట్ల వరకూ తన స్నేహితుల ఖాతాకు తరలించాడు. వారికి ఖాతాల నుంచి తిరిగి తన బ్యాంక్ ఖాతాలోకి ఆ డబ్బును మళ్లించుకున్నాడు. ఈ క్రమంలో 4 నెలల క్రితం వైద్య అవసరాల కోసమని చెప్పి సెలవులు తీసుకున్నాడు. అయితే అప్పటి నుంచి అంకూర్ కనిపించకుండా పోయాడు.

ఇద్దరూ వివాహితులే..
మరోవైపు ఢిల్లీలోని జీటీబీ ఎన్ క్లేవ్ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై నేహా పూనియా సైతం సెలవులని చెప్పి కనిపించకుండా పోయారు. అయితే వీరిద్దరు ఒకే బ్యాచ్ కు చెందిన ఎస్సైలు కావడం.. ఒకరితో ఒకరికి పరిచయముండటంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే అంకూర్ చేసిన ఫ్రాడ్ గురించి తెలిసింది. ఆ డబ్బుతోనే అతడు పరారైనట్లు తేలింది. అయితే అంకూర్, నేహాకు గతంలోనే వేరేవాళ్లతో వివాహాలు జరిగినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. 4 నెలల పరిశోధన తర్వాత తాజాగా వారిద్దరిని గుర్తించినట్లు పేర్కొన్నారు.

Also Read: Gold Rates (23-07-2025): గోల్డ్ రేట్స్ మళ్లీ పెరిగాయ్.. వరుసగా రెండో రోజు బాదుడు..

పోలీసులు ఏమన్నారంటే?
నిందితుల నుంచి రూ.కోటి విలువైన బంగారం, 12 లక్షల నగదు, 11 మెుబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 3 ఏటీఎం కార్డులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. దొంగిలించిన డబ్బుతోనే వారు బంగారం కొనుగోలు చేశారని స్పష్టం చేశారు. దొంగిలించిన సొమ్మును తమ ఖాతాల్లోకి బదిలి చేయించుకున్న ముగ్గురు వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి పేర్లు మహ్మద్, మోను, షాదాబ్ గా పేర్కొన్నారు. ‘సైబర్ నేరస్థుల నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్మును ఎవరూ క్లెయిమ్ చేయలేదని ఎస్సై అంకూర్ కు తెలుసు. అందుకే తప్పుడు పత్రాలు సమర్పించి కోర్టు నుండి డబ్బు విడుదలకు అనుమతి తెచ్చుకున్నారు. ఆ డబ్బు తీసుకోని మరో ఎస్సై నేహాతో పారిపోయారు. ఆ డబ్బుతో గోవా, మనాలి, కాశ్మీర్ వంటి ప్రదేశాలు తిరిగారు. ఆ తర్వాత యూపీలోని ఇండోర్ కు చేరుకొని బంగారాన్ని కొనుగోలు చేశారు. మధ్యప్రదేశ్ లోని కొండ ప్రాంతాల్లో సెటిల్ కావాలని వారు భావించారు’ అంటూ ఢిల్లీ పోలీసులు వివరించారు.

Also Read This: Watch Video: పవన్ పాటతో దుమ్మురేపిన టెక్కీలు.. ఫారెన్ క్లెయింట్‌కు కళ్లుచెదిరే స్వాగతం!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?